Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

కొత్త కాంబినేషన్ తెరపైకి వచ్చేసింది. విజయ్ దేవరకొండ, రాధిక మదన్ ఓ ప్రైవేటు ఆల్బమ్‌కు జత కట్టనున్నారు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెల్సా.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే మతిపోద్ది.. ఆ వివరాలు..

సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?
Sahiba Private Album
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 08, 2024 | 7:30 PM

‘హీరియే.. హీరియే..’ సాంగ్ గుర్తుందా.? ఆ పాటలో నటించిన అమ్మాయే జస్లీన్ రాయల్. దుల్కర్ సల్మాన్ మేల్ లీడ్‌లో కనిపించిన ఈ సాంగ్.. మ్యూజిక్ ఆల్బమ్స్‌లో చాట్‌బస్టర్‌గా నిలిచింది. గతేడాది సంచలనం సృష్టించిన ఈ బాలీవుడ్ సింగర్.. ఇప్పుడు విజయ్ దేవరకొండతో జతకట్టింది. నవంబర్ 7న దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన జస్లీన్ రాయల్.. అనుకున్నట్టుగానే విజయ్ దేవరకొండ, రాధిక మదన్‌ను పరిచయం చేస్తూ వీడియో సాంగ్ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసేసింది. ఆ ఆల్బమ్ పేరు ‘సాహిబా’. పోస్టర్‌లో కమింగ్ సూన్ అని ఉండగా.. నవంబర్ 15న ఈ సాంగ్ రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

ఇవి కూడా చదవండి

విజయ్ దేవరకొండతో మొదటిసారి జతకడుతున్న బాలీవుడ్ హీరోయిన్ రాధిక మదన్.. అంతకముందు జస్లీన్ రాయల్ కాంబినేషన్‌లో ‘నై జానా’ అనే సాంగ్‌లో నటించింది. సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇక రాధిక మదన్ విషయానికొస్తే.. బుల్లితెరతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ‘మేరి ఆషికీ తుమ్ సే హి’ అనే సీరియల్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘రేయ్’, ‘ఫీల్స్ లైక్ ఇష్క్’, ‘సాస్, బహు ఔర్ ఫ్లెమింగో’ లాంటి వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంది.

ఇది చదవండి: బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే

మరోవైపు ‘పటాకా’ అనే మూవీతో సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టిన రాధిక మదన్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘అంగ్రేజీ మీడియం’, ‘శిద్దట్’, ‘కుట్టీ’ లాంటి హిట్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. అలాగే బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌తో ‘సర్ఫిరా’ అనే సినిమాలో నటించింది. త్వరలోనే ‘సనా’, ‘సుబేదార్’ అనే చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనుంది.

ఇది చదవండి: 90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే స్టన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి