AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియా పొమ్మన్నలేక పొగబెట్టింది.. కట్ చేస్తే.. అన్‌లక్కీ ప్లేయర్‌‌గా ఊహకందని ఊచకోత.. ఎవరంటే

పనికిరాడని పక్కనపెట్టేసిన ఓ ప్లేయర్.. టీమిండియాకి గట్టిగా జవాబు ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో వరుసగా సెంచరీలు సాధించి.. తనకన్నా తోపు ప్లేయర్ ఎవడూ లేడని మరోసారి ప్రూవ్ చేశాడు.. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే

టీమిండియా పొమ్మన్నలేక పొగబెట్టింది.. కట్ చేస్తే.. అన్‌లక్కీ ప్లేయర్‌‌గా ఊహకందని ఊచకోత.. ఎవరంటే
Team India
Ravi Kiran
|

Updated on: Nov 07, 2024 | 5:55 PM

Share

రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా గ్రూప్-ఏ మ్యాచ్‌లో ముంబై తరపున బరిలోకి దిగిన శ్రేయాస్ అయ్యర్ డబుల్ సెంచరీ సాధించాడు. శరద్ పవార్ క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై, ఒడిశా జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒడిశా.. తొలుత ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ముంబై తరఫున అంగ్రీష్ రఘువంశీ(92) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిద్ధేశ్ లాడ్ సెంచరీ సాధించగా, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేసిన అయ్యర్.. ఒడిశా బౌలర్లను ఉతికిఆరేశాడు. తొలి రోజే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 152 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన శ్రేయాస్ అయ్యర్.. కేవలం 200 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేయడం విశేషం. అయ్యర్ 209 బంతుల్లో 8 సిక్సర్లు, 22 ఫోర్ల సాయంతో 207 పరుగులతో అజేయంగా నిలిచాడు. 107 ఓవర్లు ముగిసేసరికి ముంబై మూడు వికెట్ల నష్టానికి 464 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా కళ్లు చెదిరేలా

టీమిండియా తరుపున 14 టెస్టులు ఆడిన శ్రేయాస్ అయ్యర్ ఒక సెంచరీతో 811 పరుగులు చేశాడు. భారత టెస్టు జట్టుకు దూరమైన అయ్యర్.. గతంలో దేశవాళీ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించి మరోసారి భారత జట్టులోకి పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ నెలాఖరు నుంచి జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి కూడా అయ్యర్‌ను ఎంపిక చేయలేదు టీమ్ మేనేజ్‌మెంట్. అయితే సీనియర్లందరూ న్యూజిలాండ్ సిరీస్‌లో పేలవ ఫామ్ చూపించడంతో.. అయ్యర్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత జట్టులో మళ్లీ ఎంపిక అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇది చదవండి: బాబోయ్.! ఏపీకి మరో వర్ష గండం.. ఈ ప్రాంతాలకు వర్షాలే వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఇక శ్రేయాస్ అయ్యర్ ఈ ఏడాది రంజీ ట్రోఫీ అత్యధిక రన్స్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 4 ఇన్నింగ్స్‌లలో 405 పరుగులు చేసిన అయ్యర్.. 101 యావరేజ్‌తో రెండు సెంచరీలు సాధించి.. 233 అత్యధిక స్కోర్ నమోదు చేశాడు.

ఇది చదవండి: ట్రైన్ ఏసీ భోగీ వెలుపల ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి లగేజి చెక్ చేయగా!

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..