Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: పైకి చూసి చెత్త కుప్ప అనుకునేరు.. తీరా లోపలకెళ్లి చూడగా దిమ్మతిరుగుద్ది

పూలకుండీలో గంజాయి.. లేడీస్‌ హాస్ట్‌లో గంజాయి.. కాలేజీ వెనక గంజాయి.. గోంగూర తోటలోనూ గంజాయి గబ్బే.. ఇలా ఇందుగలదు.. అందులేదు అనే సందేహమే లేదు. ఎందెందు వెదికినా గంజాయి జాడలు కలదు. అన్నట్టు ఉంది సిచ్యూవేషన్‌.

Vizag: పైకి చూసి చెత్త కుప్ప అనుకునేరు.. తీరా లోపలకెళ్లి చూడగా దిమ్మతిరుగుద్ది
Vizag
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 09, 2024 | 7:51 PM

విశాఖపట్నంలో అలల సందడేమో కానీ.. మత్తు గమ్మత్తు సిత్రాలు అలజడి రేపుతున్నాయి. ప్రతిరోజు కేజీల్లో కాదు.. టన్నులో పట్టుబడుతోంది గంజాయి. నిఘా పెట్టినా సరే సరుకు సరిహద్దు దాటుతోంది. గల్లీకో సెంటర్‌గా గప్‌ చుప్‌గా గంజాయి దందా సాగుతోంది. పొడి.. తడి.. లిక్విడ్‌ నానా రూపాల్లో సరిహద్దులు దాటేస్తోంది సరుకు. ఈ మత్తు మాఫియా బెండు తీస్తున్నా.. రవాణా ఆగడం లేదు. వణుకుపుట్టించేలా యాక్షన్‌ ఉంటున్నా.. కూడా స్మగ్లింగ్‌కు బ్రేక్‌ పడటం లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది..? దీన్ని ఎక్కడ పండిస్తున్నారని ఆరా తీస్తే.. పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి.

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా.. ఈ విజువల్స్‌లో మొత్తం తుప్పలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ ఈ తుప్పలోనే గంజాయి సాగు జరుగుతోంది. ఇది ఏ బస్తీ చివర ఖాళీ ప్రదేశంలోనో.. ఎవరూ రాని రైలు పట్టాల పక్కనో కాదు. విశాఖ నగరం నడిబొడ్డులో జరుగుతున్న తంతు. అదికూడా కేజీహెచ్‌ కొండపై బాలికల హాస్టల్‌ వెనుక ఉన్న కొండపై స్మగ్లర్లు గంజాయి పండిస్తున్నారు. ఏడాదిన్నరకాలంగా స్మగ్లర్లు కొండపై గంజాయి పండిస్తున్నారు. నేవీ పరిధిలో ఉన్న ప్రాంతంలో గంజాయి సాగు చేయడం ఆందోళన కలిగిస్తోంది. సీపీ బాగ్చి ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ పోలీస్ బృందం.. రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయి తొటలను ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

కాగా, ఈ గంజాయి మొక్కలు పెంచడం అంతా ఈజీ కాదు. ఆ మొక్క పెరగాలంటే ఓ ప్రాసెస్‌ ఉంటుంది. దీని వెనక ఎవరున్నారనే దానిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే నిందితులంతా ఒక ముఠాగా ఏర్పడి గంజాయి సాగు చేస్తున్నారా..? లేదంటే గంజాయికి బానిసగా మారి మొక్కలు పెంచుతున్నారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..