Andhra Pradesh: సైలెన్సర్‌ తీస్తే తాట తీస్తున్నారు.. ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

నిబంధనలకు విరుద్ధంగా బైక్ సెలెన్సర్లను తొలగించి వాహనాలు నడిపిస్తున్న వారిపై పోలీసులు సీరియస్ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా విశాఖ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించారు. ఇందులో భాగంగానే బైక్ సైలెన్సర్లను తొలగించారు..

Andhra Pradesh: సైలెన్సర్‌ తీస్తే తాట తీస్తున్నారు.. ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌
Ap Police
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 09, 2024 | 7:57 PM

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యువతలపై ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విశాఖలో ఈ మధ్య బైక్‌ సైలెన్సర్లు తీసి వాహనాలు నడిపిస్తున్న వారి సఖ్యం పెరుగుతోంది. కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను తీసేసి అధిక శబ్దం , పొగ వచ్చేలా చేస్తున్నారు. ఈ వ్యవహారం పై నగరంలో చాలా మంది పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విపరీత ధోరణి ని కట్టడి చేయాలనే ఉద్దేశ్యంతో, మోడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా రోడ్డు మీద నడిచి వెళ్ళే వాళ్ళకు, అలాగే మిగతా వాహనదారులకు ఆందోళన కలిగించే యువత పై విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్, అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు.. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 181 సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇలాంటి సైలెన్సర్లను ఉపయోగించడం భారత మోటార్ వాహన చట్టం-1988లో సెక్షన్ 190 (ii) ప్రకారం నేరమని పోలీసులు చెబుతున్నారు. ఇందుకుగాను మూడు నెలల జైలు శిక్ష లేదా రూ. 10,000/- లు వరకు జరిమానా విధిస్తారు. వీటితోపాటు డ్రైవింగ్ లైసెన్సును మూడు నెలలపాటు సస్పెండ్ కూడా చేస్తారు. రెండోసారి అతిక్రమిస్తే.. ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 10,000/-ల వరకు జరిమానా విధించడంతో పాటు సదరు వాహనాన్ని కూడా సీజ్ చేస్తారు.

లైసెన్సులను తొలగించి వాహనాలను నడపడం వల్ల గుండె జబ్బులున్న వారు, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతోన్న నేపథ్యంలో పేరెంట్స్‌ సైతం కఠినంగా వ్యవహరించాలని విశాఖపట్నం సిటీ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే భారీ శబ్ధాలను చేసే సైలెన్సర్లను వాహనాలకు అమర్చే మెకానిక్ షాప్ ల వారు ఇకపై అటువంటి సైలెన్సర్లను వాహనాలకు అమర్చకుండా నియంత్రణ పాటించాలని పోలీసులు ఆదేశించారు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు హెల్మెట్‌ ధరించకుండా వాహనం నడిపినందుకుగాను సుమారు 70,500 మంది ద్విచక్ర వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వాహనం నడిపేవారితో పాటు, వెనకాల కూర్చున్న వారు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..