Andhra Pradesh: రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై కీలక నిర్ణయం..
అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించింది. కేటాయించిన ప్లాట్లలోని వీధి పోట్లు, గ్రామకంఠాలు, జరీబు వంటి సమస్యలను త్రిమెన్ కమిటీ చర్చిస్తోంది. రైతుల అన్ని భూ సమస్యలకు న్యాయం జరిగేలా కసరత్తు జరుగుతోంది. గ్రామకంఠ భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు.

అమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు శరవేగంగా ముందుకెళ్తుంది. మరి ఇప్పటిదాకా ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలేంటి…? మరోసారి భేటీ అయిన త్రిమెన్ కమిటీ తేల్చిందేంటి…? అనేది తెలుసుకుందాం..
రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు త్రీమెన్ కమిటీ మరోసారి సమావేశమైంది. రైతులకు కేటాయించే ప్లాట్లలో వీధి పోట్లు, గ్రామకంఠాలు, జరీబు, నాన్ జరీబు సమస్యలు, అలాగే కరెంట్ లైన్లు ఉన్న భూముల గురించి ప్రధానంగా చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక విషయాలు వెల్లడించారు. త్వరలోనే గ్రామకంఠ భూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఫోర్ హండ్రెడ్ KV లైన్స్ ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ కిందకు తీసుకోవాలని రైతులు అడిగినట్లు తెలిపారు. కానీ ఆ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున అది సాధ్యపడదని చెప్పారు.
అసెన్స్ ల్యాండ్‌పైనా ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగింది. వీధి పోట్లపైనా త్రీమెన్ కమిటీ చర్చించిందని పెమ్మసాని తెలిపారు. ఆ భూములపై క్లారిటీ వచ్చేందుకు రెవెన్యూశాఖను సంప్రదించిందని చెప్పారు. అలాగే CRDA ప్లాట్ల లోన్లు ఇవ్వాలని బ్యాంకు అధికారులకు సూచించినట్లు వెల్లడించారు. మొత్తంగా రైతులకు న్యాయం జరిగేలా అన్ని సమస్యల పరిష్కారానికి కసరత్తు చేస్తున్నాని తెలిపారు. త్రీమెన్ కమిటీ ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని.. తప్పుడు ప్రచారాలు నమ్మోద్దని పెమ్మసాని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
