మీరు రోజంతా నీరసంగా ఉండటానికి కారణం ఇదే.. వెంటనే మార్చుకోకపోతే తిప్పలు తప్పవు..
నిద్ర సరిపోయినా ఉదయం అలసిపోతున్నారా.. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మీరు లేవగానే చేసే కొన్ని తప్పులు రోజంతా నీరసం, బరువు పెరగడానికి కారణం అవుతాయి. స్మార్ట్‌ఫోన్ చూడటం, అల్పాహారం మానేయడం వంటి 5 అలవాట్లు మీ శక్తి స్థాయిలను దెబ్బతీస్తాయి. ఈ అలవాట్లను మార్చుకుంటే రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు.

రాత్రి 7 నుండి 8 గంటల పాటు హాయిగా నిద్రపోయినప్పటికీ ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, నీరసం, రోజంతా బద్ధకంగా అనిపిస్తుందా..? అయితే దానికి కారణం నిద్ర లేకపోవడం కాదు మీరు నిద్రలేచిన వెంటనే చేసే కొన్ని ఉదయపు తప్పులే అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన మొదటి కొన్ని అలవాట్లు రోజంతా మన శక్తి స్థాయిలను, జీవక్రియను శాసిస్తాయి. మీరు ఈ రోజు నుండే మానుకోవాల్సిన ఆ 5 అలవాట్లు ఇవే..
నీరు తాగకపోవడం
రాత్రంతా నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం సహజంగానే డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఉదయం నిద్రలేవగానే ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగకపోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఇది కేవలం నీరసానికే కాకుండా బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్లిపోయి శరీరం ఉత్తేజితమవుతుంది.
నిద్రలేవగానే స్మార్ట్‌ఫోన్ చూడటం
చాలా మందికి కళ్లు తెరవగానే ఫోన్ వెతుక్కోవడం అలవాటు. ఇది మెదడుపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ కళ్లను త్వరగా అలసిపోయేలా చేస్తాయి. దీనివల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మీ రోజు బద్ధకంతో ప్రారంభమవుతుంది.
మరో ఐదు నిమిషాలు అంటూ..
అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కి మళ్లీ నిద్రపోవడం మీ శరీర జీవ గడియారాన్నిగందరగోళానికి గురి చేస్తుంది. దీనివల్ల రోజంతా మెదడు మబ్బుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ అలవాటు జీవక్రియను నెమ్మదింపజేసి ఊబకాయానికి కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
అల్పాహారం మానేయడం
అల్పాహారం అనేది రోజంతటికి కావలసిన ఇంధనం వంటిది. బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల శరీరం కొవ్వును నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. శక్తి స్థాయిలు పడిపోతాయి. ఇది మీ ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుంది.
ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ
చాలా మంది బెడ్ కాఫీతో రోజును ప్రారంభిస్తారు. కానీ ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల అసిడిటీ పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను అడ్డుకుంటుంది. దీనికి బదులుగా గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమం.
మీ ఉదయపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యకరమైన బరువును కూడా నిర్వహించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
