Head Masssage: హెడ్ మసాజ్‌తో ఎన్నో ప్రయోజనాలు.. కానీ రోజూ చేసుకుంటే? వైద్యుల హెచ్చరిక!
అతిగా చేస్తే ఏదైనా మంచిది కాదని తెలిసిందే. అలాగే మనం రిలాక్సేషన్ కోసం చేసే పని కొన్నిసార్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అందుకే కొన్ని పనులు చేసే ముందు డాక్టర్ల సలహా తీసుకోవాలి. లేకుంటే కష్టాలు తప్పవు. లేదా అనారోగ్యం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి.

ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెబుతుంటారు. అయితే, ఒత్తిడి నిండిన ఈ ఆధునిక జీవితంలో హెడ్ మసాజ్ చాలా మందికి ఇష్టమైన రిలాక్సేషన్ మార్గాల్లో ఒకటి. సెలూన్‌లో హెయిర్ వాష్ సమయంలో లేదా ఇంట్లో స్వయంగా చేసుకునే ఈ మసాజ్ రిలాక్సేషన్‌ను ఇస్తుంది. కానీ తప్పుడు పద్ధతిలో లేదా అతిగా చేస్తే ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా మెడ భాగంలో గట్టి ఒత్తిడి పడితే లేదా తలను అతిగా వెనక్కి వంచితే వెర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ (వెర్టిబ్రల్ ఆర్టరీలో చీలిక) ఏర్పడి స్ట్రోక్ రావచ్చట. దీన్నే “బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్” అంటారు. 1993లో మొదటిసారి నమోదైన ఈ సమస్య అరుదైనది అయినప్పటికీ, సెలూన్‌లలో హెయిర్ వాష్ లేదా మసాజ్ సమయంలో ఇటువంటి ప్రమాదాలు జరిగిన కేసులు ప్రపంచవ్యాప్తంగా చాలా నమోదయ్యాయి. భారత్‌లోనూ హైదరాబాద్, బెంగళూరు, బళ్లారి వంటి చోట్ల ఇటీవల కేసులు రిపోర్ట్ అయ్యాయి
ఉదాహరణకు.. 30 ఏళ్ల యువకుడు సెలూన్‌లో మసాజ్ చేయించుకున్న తర్వాత స్ట్రోక్‌తో ICUలో నెలలు చికిత్స తీసుకున్నాడని వార్తలు చాలా వచ్చాయి. మైకం, తలతిరగడం, వికారం, మాట్లాడలేకపోవడం, శరీర బలహీనత వంటి లక్షణాలు రావొచ్చు.
సరైన విధానంలో చేసుకుంటే హెడ్ మసాజ్‌తో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి లేదా ఆర్గాన్ నూనెతో మెల్లగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పలు అధ్యయనాల ప్రకారం, 15-25 నిమిషాల మసాజ్ స్ట్రెస్ హార్మోన్ల (కార్టిసాల్, నోర్‌ఎపినెఫ్రిన్) విడుదలను తగ్గించి, రక్తపోటు, హార్ట్ రేట్‌ను అదుపులో ఉంచుతుంది. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక శాంతి కలుగుతుంది. నిద్ర నాణ్యత మెరుగవుతుంది. జపాన్‌లో చేసిన ఒక అధ్యయనంలో రోజూ 4 నిమిషాల మసాజ్‌తో 24 వారాల్లో జుట్టు మందంగా పెరిగి, ఫోలికల్స్‌కు రక్త సరఫరా పెరిగి జుట్టు రాలడం తగ్గినట్టు గుర్తించారు.
మొత్తంగా హెడ్ మసాజ్ రిలాక్సేషన్‌కు ఉత్తమమైన పద్ధతి. కానీ సున్నితమైన ప్రక్రియ. మెడపై గట్టి ఒత్తిడి లేదా హైపర్ ఎక్స్‌టెన్షన్ లేకుండా, నిపుణుల సలహాతో మెల్లగా చేసుకోవాలి. తప్పదు అనుకుంటే సెలూన్‌లో టవల్ సపోర్ట్ ఉపయోగించి, జెంటిల్ మసాజ్ చేయమని చెప్పండి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ సుఖాన్ని ఆస్వాదించండి!
