AP gurukula Schools: గురుకులాలు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు భారీగా బడ్జెట్‌ కేటాయింపు.. కూటమి సర్కార్ దూకుడు

రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో మౌలిక వసతుల రూపకల్పనకు కూటమి సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ మేరకు నిథుల కేటాయింపు వివరాలను అసెంబ్లీలో వెల్లడించారు..

AP gurukula Schools: గురుకులాలు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు భారీగా బడ్జెట్‌ కేటాయింపు.. కూటమి సర్కార్ దూకుడు
Budget To Gurukula Schools
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 12, 2024 | 5:19 PM

అమరావతి, నవంబర్‌ 12: కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుతున్న గురుకులాలు, వసతిగృహాల్లో వసతి సౌకర్యాలు కల్పించేందుకు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. బీసీ గురుకులాలకు ఆర్థిక చేయూత కోసం రూ. 361.64 కోట్లు, గురుకులాల భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు రూ.25 కోట్లు, కళాశాల వసతి గృహాలకు మరో రూ. 117.75 కోట్లు కేటాయించింది. బీసీ భవన్, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి రూ. 10.12 కోట్లు కేటాయించింది. అలాగే 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో చేపట్టి పురోగతిలో ఉన్న 3 బీసీ భవన్‌లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలను ఈ నిధులతో పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. బీసీ స్టడీ సర్కిళ్ల పునరుద్ధరణకు రూ. 8 కోట్లు, విదేశీ విద్యాదరణ పథకానికి రూ. 36.11 కోట్లు బడ్జెన్‌ను కేటాయించారు. కాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని గురుకులాల్లో కనీస వసతి సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాలకు పునరుద్ధరణ పనులు పునఃప్రారంభించేలా కార్యచరణ రూపొందిస్తున్నారు.

ఆఫీస్‌ ఆటోమెషిన్‌-కంప్యూటర్స్‌ అండ్‌ అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ నైపుణ్య పరీక్ష తేదీలు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఆఫీస్‌ ఆటోమెషిన్‌-కంప్యూటర్స్‌ అండ్‌ అసోసియేట్‌ సాఫ్ట్‌వేర్‌ నైపుణ్య పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసినవారికి హాల్‌టిక్కెట్లను విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. దరఖాస్తు చేసుకున్న వారంతా కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్ష నవంబరు 19, 20వ తేదీల్లో జరుగుతుందని వెల్లడించింది.

డిసెంబరు 29న ఎంపీహెచ్‌ఏ రాత పరీక్ష.. త్వరలో హాల్‌ టికెట్లు

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నిర్వహించే ‘ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌)’ కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష డిసెంబరు 29న నిర్వహించనున్నట్లు నియామక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.