Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఫ్యాషన్‌ డిజైనర్‌కు చేదు అనుభవం! షాపింగ్‌కు వెళ్లివచ్చేలోగా కారు టైర్లు కోసేశారు.. పైగా బెదిరింపులు

హైదరాబాద్‌ నగరంలో ఓ షాపు యాజమన్యం పట్టపగలే రెచ్చిపోతున్నారు. బట్టలు కొనుగోలు చేసేందుకు ఓ దుకాణానికి వచ్చిన ఫ్యాషన్‌ డిజైనర్‌కు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. షాపు ముందు కారు ఆపి షాప్‌లో బట్టలు కొని వచ్చేలోపు తన కారు టైర్లను ధ్వంసం చేశారు. ఇనుప చువ్వలతో కారు టైర్లను కోసేసి..

Hyderabad: ఫ్యాషన్‌ డిజైనర్‌కు చేదు అనుభవం! షాపింగ్‌కు వెళ్లివచ్చేలోగా కారు టైర్లు కోసేశారు.. పైగా బెదిరింపులు
Fashion Designer's Car
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 19, 2024 | 5:29 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 19: ‌హైదరాబాద్‌ నగరంలో ఓ షాపు యాజమన్యం పట్టపగలే రెచ్చిపోతున్నారు. బట్టలు కొనుగోలు చేసేందుకు ఓ దుకాణానికి వచ్చిన ఫ్యాషన్‌ డిజైనర్‌కు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. షాపు ముందు కారు ఆపి షాప్‌లో బట్టలు కొని వచ్చేలోపు తన కారు టైర్లను ధ్వంసం చేశారు. ఇనుప చువ్వలతో కారు టైర్లను కోసేసి గాలి తీసినట్లు ఆమె గుర్తించింది. ఇదేంటని సదరు షాపు యజమానిని అడిగితే బెదిరింపులకు దిగడంతో ఆమె షాక్ కు గురౌంది. ఈ షాకింగ్‌ ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో నివసించే ఫ్యాషన్‌ డిజైనర్‌ జీ కీర్తిరెడ్డి ఫ్యాబ్రిక్‌ కొనుగోలు చేసేందుకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లోని ర్యాన్‌గ్రడ్జ్‌ ఫ్యాబ్రిక్‌ స్టోర్‌కు తన కారులో వచ్చింది. తన కారు టీఎస్‌ 09 ఈజెడ్‌ 1221ను ర్యాన్‌గ్రడ్జ్‌ ఫ్యాబ్రిక్‌ స్టోర్‌ ముందు పార్కింగ్‌ చేసి షాపు లోపలికి వెళ్లింది. అందులోకి కాకుండా మరో షాపులోకి వెళ్లి పది నిమిషాల తర్వాత ఆమె తిరిగి వచ్చింది.

అయితే ఆమె తన కారు స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా రెండు టైర్లు పూర్తిగా దెబ్బతి ఉండటం కనిపించాయి. ఇనుప చువ్వలతో ఉద్దేశ్య పూర్వకంగా కారు టైర్లను కోసేసి గాలి తీసినట్లు గుర్తించింది. దీంతో ఆమె స్టోర్‌ యజమానికి ఫిర్యాదు చేయగా.. అతడు అసభ్యంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు షాపులో పనిచేసే ఉద్యోగి తన కారును ధ్వసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులు ఆ స్టోర్‌ ఉద్యోగిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 324(4), 125, 351(2), రెడ్‌విత్‌ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.