Telangana: రైల్వే ప్యాసింజర్లకు గుడ్ న్యూస్.. తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు కొత్త రూపురేఖలు..
Amrit Bharat Station Scheme: భవిష్యత్ అవసరాలను అధిగమించేందుకు రైల్వే స్టేషన్‌లను ఆధునీకరించడం, నిరంతర ప్రాతిపదికన అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విధానాన్ని రూపొందించింది.ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తారు.
Telangana Railway Stations Development: భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దృక్పథంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” (Amrit Bharat Station Scheme) కింద రైల్వే ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలను అందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 38 రైల్వే స్టేషన్‌లను ఏకంగా రూ.1830.4 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా శాటిలైట్ టెర్మినల్ గా అభివృద్ధి చెందుతున్న చెర్లపల్లి రైల్వే స్టేషన్‌తో సహా సికింద్రాబాద్, ఇతర రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ఆగస్టు, ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయడంతో ఈ పథకానికి సంబంధించిన పనులు జోరందుకున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనుల్లో ప్రధానమైన అభివృద్ధి పనులతో పాటు, ప్రస్తుతం భాగ్యనగరంలోని ఇతర రైలు టెర్మినల్స్ లో కూడా రద్దీని తగ్గించడానికి చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ అభివృద్ధిని చేపట్టబడింది.
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ప్రణాళిక చేయబడిన సౌకర్యాలు :
- ముఖద్వారాల అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారాలు.
- స్టేషనుకు దారి తీసే రోడ్లను వెడల్పు చేయడం ద్వారా రాకపోకలను సులభతరం చేయడం
- సరైన రీతిలో రూపొందించబడిన సైనేజీలు, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు, సరైన పార్కింగ్ ప్రదేశం, మెరుగుపరచబడిన లైటింగ్ మొ॥నవి.
- స్టేషను ఆవరణలో పచ్చదనాన్ని పెంచడం, ల్యాండ్ స్కేపింగ్
- రైలు వినియోగదారులకు ఆహ్లాదకర అనుభూతిని చేకూర్చేందుకు స్థానిక కళలు మరియు సంస్కృతికి ప్రాధాన్యతనివ్వడం
- ‘‘వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్’’ పథకం కింద స్టాళ్లను ఏర్పాటు చేయడం.
- సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా స్టేషన్ భవనం, ప్రాంగణానికి రెండవ ప్రవేశాన్ని ఏర్పాటు చేయడం
- ఎక్కువ ఎత్తున్న ప్లాట్ఫారంల నిర్మాణం, సరిపడే విధమైన షెల్టర్ల నిర్మాణం.
- మరింత నాణ్యత గల పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్, ఎల్ఈడి స్టేషన్ నేమ్ బోర్డులు, వెయిటింగ్ హాళ్లకు అభివృద్ధి పనులు, వినియోగదారుల కోసం సైనేజీలు మొ॥ వాని ఏర్పాటు
- స్టేషన్లను ‘సిటీ కేంద్రాలు ‘గా అభివృద్ధి చేయడం.
- నగరానికి రెండు వైపుల అనుసంధానం
- స్టేషన్ భవనాల అభివృద్ధి/పునరాభివృద్ధి.
- చక్కగా డిజైన్ చేయబడిన ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాల ఏర్పాటు
- ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చక్కగా రూపొందించబడిన ట్రాఫిక్ సర్క్యులేషన్ మరియు ఇంటర్-మోడల్ ఇంటిగ్రేషన్.
- మాస్టర్ ప్లాన్‌లకు అనుగుణంగా తగిన ప్రోత్సాహ అభివృద్ధిని అందించడం.
- స్టేషన్ వినియోగదారులకు ఆహ్లాదకరమైన ప్రాకృతిక అనుభవాన్ని అందించడానికి ల్యాండ్‌స్కేపింగ్, గ్రీనరీ, స్థానిక కళలు, సాంస్కృతిక చిహ్నాలు.
ఈ స్టేషన్‌లన్నింటి అభివృద్ధి ప్రస్తుతం వివిధ దశల్లో పురోగతిలో ఉంది. జంట నగరాల్లోని రెండు ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లు అంటే కాచిగూడ, లింగంపల్లి రైల్వే స్టేషన్‌ల కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అధ్యయనం ఫైనల్ ప్రక్రియలో ఉంది.
తెలంగాణ – అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద స్టేషన్ల జాబితా..
1 సికింద్రాబాద్ 700.00 కోట్లు
2 హైదరాబాద్ 309.00 కోట్లు
3 ఆదిలాబాద్ 17.80 కోట్లు
4 భద్రాచలం రోడ్ 24.40 కోట్లు
5 హఫీజ్పేట 26.60 కోట్లు
6 హైటెక్ సిటీ 26.60 కోట్లు
7 హుప్పుగూడ 26.81 కోట్లు 8 జనగాం 24.50 కోట్లు
9 కామారెడ్డి 39.90 కోట్లు
10 కరీంనగర్ 26.60 కోట్లు
11 కాజీపేట జంక్షన్ 24.45 కోట్లు
12 ఖమ్మం 25.40 కోట్లు
13 మధిర 25.40 కోట్లు
14 మహబూబ్ నగర్ 39.87 కోట్లు
15 మహబూబాబాద్ 39.72 కోట్లు
16 మలక్ పేట 36.44 కోట్లు
17 మల్కాజిగిరి 27.61 కోట్లు
18 నిజామాబాద్ 53.30 కోట్లు
19 రామగుండం 26.49 కోట్లు
20 తాండూరు 24.40 కోట్లు
21 యాదాద్రి 24.45 కోట్లు
22 జహీరాబాద్ 24.35 కోట్లు
23 బాసర్ 11.33 కోట్లు
24 బేగంపేట 22.57 కోట్లు
25 గద్వాల్ 9.49 కోట్లు
26 జడ్చర్ల 10.94 కోట్లు
27 మంచిర్యాల్ 26.49 కోట్లు
28 మెదక్ 15.31 కోట్లు
29 మేడ్చల్ 8.37 కోట్లు
30 మిర్యాలగూడ 09.50 కోట్లు
31 నల్గొండ 09.50 కోట్లు
32 పెద్దపల్లి 26.49 కోట్లు
33 షాద్‌నగర్ 9.59 కోట్లు
34 ఉమ్దానగర్ 12.37 కోట్లు
35 వికారాబాద్ 24.35 కోట్లు
36 వరంగల్ 25.41 కోట్లు
37 యాకుత్పురా 8.53 కోట్లు
38 శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ 6.07 కోట్లు
మొత్తం స్టేషన్లు: 38 స్టేషన్లు మొత్తం ఖర్చు: రూ. 1830.4 కోట్లు