జైలులో ‘రామాయణం’ నాటకం.. వానర వేషంలోని ఖైదీలు సీత కోసం వెళ్లి, గోడ దూకి పరార్‌!

జైలు నుంచి తప్పించుకోవడానికి కొందరు ఖైదీలు వేసిన స్కెచ్‌.. పోలీసులకు దిమ్మతిరిగింది. దసరా సందర్భంగా తోటి ఖైదీలతో కలిసి రాయామణం నాటకం వేయాలని ఖైదీలంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని జైలు అధికారులకు కూడా తెలిపారు. దీంతో వారు కూడా సరే అన్నారు. అంతే.. వాళ్లకు కావల్సిన మేకప్‌ సామగ్రితో సహా అన్ని సమకూర్చి..

జైలులో 'రామాయణం' నాటకం.. వానర వేషంలోని ఖైదీలు సీత కోసం వెళ్లి, గోడ దూకి పరార్‌!
Haridwar Jail
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 14, 2024 | 5:25 PM

డెహ్రాడూన్‌, అక్టోబర్‌ 14: జైలు నుంచి తప్పించుకోవడానికి కొందరు ఖైదీలు వేసిన స్కెచ్‌.. పోలీసులకు దిమ్మతిరిగింది. దసరా సందర్భంగా తోటి ఖైదీలతో కలిసి రాయామణం నాటకం వేయాలని ఖైదీలంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని జైలు అధికారులకు కూడా తెలిపారు. దీంతో వారు కూడా సరే అన్నారు. అంతే.. వాళ్లకు కావల్సిన మేకప్‌ సామగ్రితో సహా అన్ని సమకూర్చి, స్టేజ్‌, ఆడియన్స్‌ సర్వం సిద్ధం చేశారు పోలీసులు. ఇంతలో నాటకం ప్రారంభమైంది. రామాయణ నాటకం మాంచి రసపట్టులో ఉండగా వానరవేషం వేసిన కొందరు ఖైదీలు నాటకంలో భాగంగా అధికారుల కళ్లు గప్పి జైలు నుంచి తప్పించుకున్నారు. ఇదంతా.. జైలు నుంచి తప్పించుకోవడానికి ఖైదీలు వేసిన స్కెచ్‌ అని తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఈ విచిత్ర ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జైల్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో విజయదశమిని పురస్కరించుకుని హరిద్వార్‌ జైలులో కొందరు ఖైదీలు శనివారం రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించారు. నాటకంలో కొందరు ఖైదీలు వానర వేషాలు ధరించారు. నాటకం రసవత్తరంగా సాగుతుండటంతో జైలు అధికారులు, సిబ్బంది, గార్డులంతా నాటకం చూడడంలో నిమగ్నమయ్యారు. దీంతో ఇదే అదునుగా భావించిన వానర వేషంలో ఉన్న ఇద్దరు ఖైదీలు సీత పాత్ర కోసం వెళ్లి, నిచ్చెన ద్వారా గోడ దూకి పరారయ్యారు. చోటు అనే మరో ఖైదీ మాత్రం నిచ్చెన పడిపోవడంతో తప్పించుకోలేకపోవడంతో పోలీసులకు దొరికిపోయాడు. జైలులో రామ్‌లీలా నాటకం వేయడానికి సరిగ్గా వారం రోజుల ముందు ఈ ముగ్గురు ఖైదీలు జైలు నుంచి పారిపోవడానికి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే తప్పించుకున్న ఇద్దరు ఖైదీల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

పరారైన ఖైదీలలో.. జీవిత ఖైదు అనుభవిస్తున్న పంకజ్‌తోపాటు, కిడ్నాప్ కేసులో అండర్ ట్రయల్‌ ఖైదీగా ఉన్న రామ్‌కుమార్ చౌహాన్ అనే ఇద్దరు ఖైదీలు శుక్రవారం రాత్రి జైలు నుంచి తప్పించుకున్నట్లు హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) ప్రమేంద్ర దోవల్ తెలిపారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని జైలర్ ప్యారేలాల్ సహా ఆరుగురు జైలు అధికారులను సస్పెండ్ అయ్యారని వెల్లడించారు. ఖైదీలను వీలైనంత త్వరగా తిరిగి అరెస్టు చేయడానికి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సదర్) జితేంద్ర మెహ్రా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామని వెల్లడించారు. పంకజ్‌, రామ్‌కుమార్‌లు మరో ఖైదీ ఛోటూతో కలిసి పారిపోవాలని పథకం వేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. రామ్‌లీలా నాటక సమయాన్ని సద్వినియోగ పరచుకుని జైలు నుంచి పారిపోవాలనుకున్నారు. ముగ్గురు కలిసి ముందుగా రెండు నిచ్చెనలను గుడ్డ ముక్కతో కట్టి గోడ పక్కన పెట్టారు. పంకజ్, రాజ్‌కుమార్ గోడను దాటగలిగారు. కానీ చోటూ నిచ్చెన ఎక్కడం ప్రారంభించగానే అది పడిపోయింది. దీంతో వీరి ప్లాన్‌ బెడిసికొట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌