AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GN Saibaba: ప్రొఫెస‌ర్ సాయిబాబా డెడ్‌బాడీ ‘గాంధీ’కి.. రెండు కళ్లు LV ప్రసాద్‌ ఆస్పత్రికి విరాళం.. మరణంలోనూ దాతృత్వం

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో దాదాపు 9 ఏళ్లు జైలులో ఉన్న సాయిబాబా... ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం క్రితం నిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ..

GN Saibaba: ప్రొఫెస‌ర్ సాయిబాబా డెడ్‌బాడీ 'గాంధీ'కి.. రెండు కళ్లు LV ప్రసాద్‌ ఆస్పత్రికి విరాళం.. మరణంలోనూ దాతృత్వం
Professor GN Saibaba
Srilakshmi C
|

Updated on: Oct 13, 2024 | 11:48 AM

Share

హైద‌రాబాద్, అక్టోబర్‌ 13: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త జీఎన్‌ సాయిబాబా కన్నుమూశారు. నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలతో దాదాపు 9 ఏళ్లు జైలులో ఉన్న సాయిబాబా… ఇటీవలే నిర్దోషిగా విడుదలయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వారం క్రితం నిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అంతర్గత రక్తస్రావంతోపాటు పొత్తికడుపులో వాపుతో ఆయన బాధపడ్డారని, బీపీ పడిపోయిందని డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సాయిబాబా కోలుకోలేకపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిబాబా మరణం తమకే కాదు ప్రజా సంఘాలకు, పీడిత ప్రజలకు తీరని లోటు అన్నారు ఆయన కుటుంబ సభ్యులు. సాయిబాబా కోరిక మేరకు గాంధీ ఆసుప్రతికి డెడ్‌బాడీని.. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి కళ్లను డొనేట్ చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్ధం మౌలాలిలోని నివాసంలో సాయిబాబా భౌతికకాయం ఉంచారు. సోమవారం ఆయన భౌతికకాయాన్ని గాంధీకి ఇవ్వనున్నారు.

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు సాయిబాబా. అయితే ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు అనారోగ్యంతో లోకాన్ని విడిచారు. సాయిబాబా మరణం పట్ల ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబా జైలులో ఉన్నంత కాలం ఆయన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక సాయిబాబా మృతికి సీపీఐ నేతలు సంతాపం తెలిపారు. సీపీఐ నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

కాగా రచయిత, మానవ హక్కుల కార్యకర్తగా గుర్తింపు పొందిన సాయిబాబా స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం. ఒక పేద రైతు కుటుంబంలో 1967లో జన్మించారు సాయిబాబా. పోలియో సోకి చిన్న వయసులోనే రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అప్పటి నుంచి వీల్ ఛైర్‌కి పరిమితమయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2014లో సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవితఖైదు విధించింది. దీంతో దాదాపు తొమ్మిదేళ్లపాటు జైల్లోనే గడపాల్సి వచ్చింది. జైలులో ఉన్న సమయంలో అనేక ఆరోగ్య సమస్యలుఎదుర్కొన్నారు సాయిబాబా. అయితే ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో నాగ్‌పూర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పుడు అనారోగ్యంతో లోకాన్ని విడిచారు. సాయిబాబా మరణం పట్ల ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.