AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ICICI బ్యాంక్ కుంభకోణంలో ఉన్నతాధికారుల హస్తం ఉంది..’ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో కలకలం

ఐసిఐసిఐ బ్యాంక్ మోసంపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఖాతాదారులను పిలిచి జరిగిన మోసం వివరాలను తెలుసుకొని సిఐడి అధికారులు రికార్డులను పరిలీస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పటి బ్యాంక్ మేనేజర్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది..

'ICICI బ్యాంక్ కుంభకోణంలో ఉన్నతాధికారుల హస్తం ఉంది..' మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో కలకలం
ICICI Bank scam
T Nagaraju
| Edited By: Srilakshmi C|

Updated on: Oct 12, 2024 | 12:39 PM

Share

గుంటూరు, అక్టోబర్‌ 12: ఐసిఐసిఐ బ్యాంక్ మోసంపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఖాతాదారులను పిలిచి జరిగిన మోసం వివరాలను తెలుసుకొని సిఐడి అధికారులు రికార్డులను పరిలీస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పటి బ్యాంక్ మేనేజర్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. ఈ వీడీయోలో తాను మోసపోయానంటూ ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ చెప్పాడు. చిలకలూరిపేట, నరసరావుపేట, విజయవాడ ఐసీఐసీఐ శాఖల్లో జరిగిన లావాదేవీలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఉన్నతాధికారులు, బ్యాంకు సిబ్బందంతా తననే తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఆర్ధిక లావాదేవీలను పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని వెల్లడించాడు. ఖాతాదారుల్ని ఎవరిని మోసం చేసే ఉద్దేశ్యం లేదని వివరణ ఇచ్చాడు. బంగారం రుణాలకు సంబంధించి కొంతమంది పేర్లు మాత్రమే మార్చినట్లు తెలిపాడు.

ఖాతాదారులకు ప్రతినెల వడ్డీ సక్రమంగా చెల్లిస్తూనే ఉన్నామన్న మేనేజర్ అన్నాడు. గత రెండు నెలలుగా జెడ్ హెచ్ సందీప్ మెహ్రా వల్ల బాగా ఇబ్బంది పడినట్లు ఆరోపించాడు. నరసరావుపేట, చిలకలూరిపేట బ్యాంకు ఉద్యోగులందరికీ అన్ని విషయాలు తెలుసన్న నరేష్.. కేవలం తనను మాత్రమే దోషిగా నిలబెడుతున్నారని కంటతడి పెట్టుకున్నాడు. అధికారుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వీడియోలో చెప్పాడు. అయితే జోషి, పిల్లలను చూసి ఆ ఆలోచన విరమించుకున్నట్లు నరేష్ తెలిపాడు. తనకు రావాల్సిన డబ్బు వస్తే మెుత్తం సర్దుబాటు చేసి బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అందరూ డబ్బు తీసుకున్నారు. కానీ ఇప్పుడు నన్ను మాత్రమే తప్పు పడుతున్నారని, తనకు ఇక బతకాలని లేదన్నాడు. ఈ వీడియోపై కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మేనేజర్ సెల్ఫీ వీడియో బ్యాంక్ కుంభకోణంలో ఉన్నతాధికారులు హాస్తం ఉందన్న ఆరోపణలు పెరిగిపోయాయి. కాగా పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఐడీ విచారణ చేపట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.