AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ratan Tata Ex Girl Friend: రతన్‌ టాటా మాజీ ప్రేయసి లవ్ అఫైర్ల గురించి తెలుసా..? పెద్ద లిస్టే ఉంది..

ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన జీవిత ప్రయాణానికి వీడ్కోలు పలికారు. జీవితంలో సామాన్యుడు కోరుకునేవన్నీ ఆయన పొందాడు. కానీ తన జీవితమంతా ఆయన ఒంటరిగానే మిగిలిపోయాడు. నాలుగు సార్లు ప్రేమలో పడ్డాడు కానీ అవేవీ కలిసి రాలేదు. రతన్‌ టాటా ప్రేమించిన అమ్మాయిల లిస్టులో బాలీవుడ్ నటి సిమి గ్రేవాల్‌ ఒకరు..

Ratan Tata Ex Girl Friend: రతన్‌ టాటా మాజీ ప్రేయసి లవ్ అఫైర్ల గురించి తెలుసా..? పెద్ద లిస్టే ఉంది..
Ratan Tata Ex Gril Friend
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 10, 2024 | 12:12 PM

ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన జీవిత ప్రయాణానికి వీడ్కోలు పలికారు. జీవితంలో సామాన్యుడు కోరుకునేవన్నీ ఆయన పొందాడు. కానీ తన జీవితమంతా ఆయన ఒంటరిగానే మిగిలిపోయాడు. నాలుగు సార్లు ప్రేమలో పడ్డాడు కానీ అవేవీ కలిసి రాలేదు. రతన్‌ టాటా ప్రేమించిన అమ్మాయిల లిస్టులో బాలీవుడ్ నటి సిమి గ్రేవాల్‌ ఒకరు. నిజానికి.. రతన్ టాటా నటి సిమి గ్రేవాల్‌ను వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ తమ ప్రేమ పెళ్లి వరకు రాలేదని జరగలేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక రతన్ టాటా పెళ్లి చేసుకోవాలనుకున్న నటి సిమి గ్రేవాల్‌ కూడా పలు మార్లు లవ్‌ అఫైర్లతో వార్తల్లో నిలిచింది. సిమి గ్రేవాల్.. పారిశ్రామికవేత్త రతన్ టాటాతో మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీతో కొంత కాలం డేట్‌, జామ్‌నగర్ మహారాజుతో రిలేషన్‌షిప్‌ నడిపింది.

జామ్‌నగర్ మహారాజా

ఇది నటి సిమి గ్రేవాల్‌కు 17 యేళ్ల వయస్సులో ఉన్నప్పటి లవ్‌ స్టోరీ. టీనేజ్‌ వయసులో ఆమె తొలిసారి ప్రేమలో పడింది. జామ్‌నగర్ మహారాజుతో ప్రేమలో పడింది. వీరి బంధం సుమారు 3 సంవత్సరాలు కొనసాగింది. ఎవరికైనా తొలి ప్రేమ చాలా ప్రత్యేకమైనది. సిమి గ్రేవాల్ విషయంలో కూడా అదే జరిగింది. ఈ టీనేజ్ ప్రేమాయణంలో ఆమె పలు భిన్నమైన, కొత్త ప్రపంచాన్ని చూసింది. కానీ జామ్‌ నగర్‌ మహారాజు మాత్రం సిమి పట్ల అంతగా ప్రేమను కురిపించేవాడు కాదు. ఇది సిమికి సుతారం నచ్చేదికాదు. దీంతో వీరి బంధం వివాహానికి ముందే తెగిపోయింది.

ఇవి కూడా చదవండి

రతన్ టాటా

సిమి ఖాతాలో రెండో ప్రియుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం దాచేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని ఎన్నో సార్లు కలిసి కనిపించారు కూడా. పలు ఇంటర్వ్యూలో సిమి గ్రేవాల్‌ కూడా రతన్ టాటాతో తన రిలేషన్‌షిప్‌ను వెల్లడించింది కూడా. వీరి బంధాన్ని కాపాడుకోవాలని సిమి చాలా ప్రయత్నించింది. ఇంతగా ప్రేమించుకున్న వీరి ప్రేమ.. పెళ్లి వరకు ఎందుకు చేరలేదనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. వీరు విడిపోయిన తర్వాత కూడా స్నేహితులుగా కొనసాగారు.

మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ

సిమి గ్రేవాల్ మూడో ప్రియుడు మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. మన్సూర్ అలీ ఖాన్ తన లైఫ్‌లోకి వచ్చినప్పుడు కొంత కాలం బాగానే ఉన్నా.. ఆ తర్వాత అతను సిమికి బ్రేకప్‌ చెప్పాడు. దీంతో ఈ ప్రేమకథ కూడా అసంపూర్తిగా మిగిలిపోయింది.

రవి మోహన్

ఈ మూడు సంబంధాలు అసంపూర్తిగా మిగిలిపోయిన తర్వాత, చివరకు సిమి గ్రేవాల్ పెళ్లి చేసుకుంది. 1970లో ప్రముఖ వ్యాపారవేత్త రవిమోహన్‌ని వివాహం చేసుకుంది. సిమి గ్రేవాల్ 27 సంవత్సరాల వయస్సులో రవిమోహన్‌ను వివాహం చేసుకుంది. అయితే వీరి వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 1979లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం సిమి ఒంటరిగానే ఉంటోంది. తాజాగా రతన్‌ టాటా మృతితో ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అందులో ‘నువ్వు పోయావని వాళ్లు అంటున్నారు.. నీవులేని లోటు భరించడం చాలా కష్టం.. చాలా కష్టం.. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.