AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: గర్భా డ్యాన్స్‌ చేస్తూ ప్రముఖ కళాకారుడు గుండెపోటుతో మృతి.. వీడియో వైరల్‌

దసరా నవరాత్రులు ఉత్తరాది వారికి ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ 9 రోజులు పూజాది కార్యక్రమాలతోపాటు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సందడిగా పండుగ జరుపుకుంటారు. తాజాగా అక్కడి నవరాత్రి ఉత్సవాల్లో గర్భా డ్యాన్స్‌ చేస్తూ ప్రముఖ కళాకారుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి..

Watch Video: గర్భా డ్యాన్స్‌ చేస్తూ ప్రముఖ కళాకారుడు గుండెపోటుతో మృతి.. వీడియో వైరల్‌
Garba Performer Ashok Mali
Srilakshmi C
|

Updated on: Oct 09, 2024 | 11:07 AM

Share

పూణె, అక్టోబర్ 9: దసరా నవరాత్రులు ఉత్తరాది వారికి ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ 9 రోజులు పూజాది కార్యక్రమాలతోపాటు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సందడిగా పండుగ జరుపుకుంటారు. తాజాగా అక్కడి నవరాత్రి ఉత్సవాల్లో గర్భా డ్యాన్స్‌ చేస్తూ ప్రముఖ కళాకారుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పూణె జిల్లాలోని ఖేడ్‌లో సోమవారం జరిగిన నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు అశోక్ మాలీ (54) గర్బా ప్రదర్శన చేస్తూ తీవ్ర గుండెపోటుతో కుప్పకూలాడు. గార్బా కింగ్‌గా ప్రసిద్ది గాంచిన అశోక్‌ మాలీ లైవ్‌ ప్రదర్శన ఇస్తూ గుండెపోటుతో మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో అశోక్‌ మాలీ హుషారుగా గర్భా డ్యాన్స్‌ చేయడం చూడొచ్చు. ఆయనతోపాటు మరో బాలుడు కూడా డ్యాన్స్‌ చేయడం వీడియోలో కనిపిస్తుంది. చుట్టూ వందలాది జనాలు చప్పట్లు కొడుతూ, మొబైల్‌లో వీడియోలు తీసుకోవడం కూడా వీడియోలో కనిపిస్తుంది. అయితే డ్యాన్స్‌ వేస్తూ ఉన్న అశోక్‌ మాలీకి హఠాత్తుగా ఛాతి భాగంలో అసౌకర్యంగా అనిపించింది.

ఇవి కూడా చదవండి

అంతే.. క్షణాల వ్యవధిలో కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చకన్ పోలీస్ స్టేషన్‌లోని సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ వాఘ్ మాట్లాడుతూ.. ఈ సంఘటన ఖేడ్ ప్రాంతంలో జరిగిందని, పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు తెలిపారు. అకస్మాత్తుగా గుండె పోటు రావడం వల్లే ఆయన మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఈ కేసును ఖేడ్ పోలీసులకు అప్పగిస్తామని వాఘ్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.