RBI Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. రుణ ఈఎంఐపై త్వరలో శుభవార్త రావచ్చన్న ఆర్బీఐ గవర్నర్

వడ్డీరేట్లు తగ్గుతాయోనని ఎదురుచూసిన వారికి అసంతృప్తే మిగిలింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని RBI గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. ఈ లెక్కన రెపో రేటు 6.5 శాతంగా కొనసాగుతుంది.

RBI Repo Rate: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. రుణ ఈఎంఐపై త్వరలో శుభవార్త రావచ్చన్న ఆర్బీఐ గవర్నర్
Rbi Governor Shaktikanta Das
Follow us

|

Updated on: Oct 09, 2024 | 11:15 AM

వడ్డీరేట్లు తగ్గుతాయోనని ఎదురుచూసిన వారికి అసంతృప్తే మిగిలింది. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవని RBI గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు. ఈ లెక్కన రెపో రేటు 6.5 శాతంగా కొనసాగుతుంది. రెపో రేటులో ఎలాంటి మార్పులు లేకపోవడం వరుసగా పదోసారి. వడ్డీ రేట్లు 2023 ఫిబ్రవరి నుంచి మారలేదు. మరోవైపు ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతానికి కట్టడి చేయాలని టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నట్లు శక్తికాంతదాస్‌ చెప్పారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పాలసీ రేట్లను 6.50 శాతం వద్ద కొనసాగించింది. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ప్రకటన చేశారు. మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురిలో 5 మంది సభ్యులు రెపో రేటును తగ్గించకూడదని ఓటు వేసినట్లు ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్ బ్యాండ్ 4 శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, RBI రెపో రేటులో ఎటువంటి మార్పు చేయలేదు.

ద్రవ్యోల్బణానికి ప్రపంచ ఉద్రిక్తత అతిపెద్ద ప్రమాదం అని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. ఇటీవలి కాలంలో లోహాలు, ఆహార ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ప్రమాదంలో పడిందన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగిందని, బేస్ ఎఫెక్ట్ కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. 2024-25 సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.1 శాతం, మూడో త్రైమాసికంలో 4.8 శాతం, నాల్గవ త్రైమాసికంలో 4.2 శాతం ఉంటుందని అంచనా.

రెపో రేటులో ఎటువంటి మార్పు లేదు. 2024లో రిజర్వ్ బ్యాంక్ వరుసగా ఐదవసారి రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు. ద్రవ్యోల్బణం రేటును అదుపులో ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, అయితే రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, ఆహార ద్రవ్యోల్బణం ఇప్పటికీ లక్ష్యానికి మించి ఉంది. అందుకే రెపో రేటును 6.50 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపో రేట్ల తగ్గింపు కోసం ఎదురుచూస్తున్న బ్యాంకు ఖాతాదారులు నిరాశకు గురయ్యారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును కూడా మారుస్తుందని, పండుగలకు ముందు EMIలు చెల్లించే వారికి ఉపశమనం లస్తుందని భావించారు. కానీ ఇది జరగలేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..