Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Bus Journey: సీట్ల కోసం సిగపట్లు పట్టిన మహిళలు.. ఉచిత బస్సు ప్రయాణంలో ఆగని కొట్లాటలు.! వీడియో వైరల్

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో విజయం కైవసం చేసుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. నిత్యం వేలాది మంది మహిళలు..

Free Bus Journey: సీట్ల కోసం సిగపట్లు పట్టిన మహిళలు.. ఉచిత బస్సు ప్రయాణంలో ఆగని కొట్లాటలు.! వీడియో వైరల్
Free Bus Journey
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 08, 2024 | 12:17 PM

మక్తల్‌, అక్టోబర్‌ 7: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో విజయం కైవసం చేసుకుని అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్ర మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించింది. నిత్యం వేలాది మంది మహిళలు ఆధార్‌ కార్డు చూపించి, బస్సుల్లో ఫ్రీగా ప్రయాణిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం అడపాదడపా బస్సుల్లో కోట్లాటలు చోటు చేసుకుంటున్నాయి. సీట్ల కోసం మహిళలు ఘర్షన పడటం, డ్రైవర్‌, కండక్టర్‌లపై దాడులు చేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల మధ్య కొట్లాటలు ఆగడం లేదు. తాజాగా మహబూబ్‌నగర్‌లో ఇలాంటి ఘర్షణ మరోమారు చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ బస్టాండ్‌లో సీట్ల కోసం ఆగి ఉన్న బస్సులో ఇద్దరు మహిళలు జుట్లుపట్టుకుని కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

నారాయణపేట జిల్లా కేంద్రం నుంచి గద్వాల వెళ్లే బస్సు సోమవారం ఉదయం 8:15 గంటలకు మక్తల్‌ బస్టాండ్‌కు వచ్చింది. ఈ సమయంలో మహిళలు ఒకర్నొకరు తోసుకుంటూ బస్సెక్కారు. సీటు విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో గొడవ ముదిరి ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిచే వరకు వెళ్లింది. మహిళలు ఇద్దరూ సిగపట్లు పట్టుకున్నారు. తోటి ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మొత్తం ఏడుగురు మహిళలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే ప్రయాణికుల గొడవ తమ దృష్టికి రాలేదని ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

దసరాకు 6,304 ప్రత్యేక బస్సులు: వీసీ సజ్జనార్‌

సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. ప్రయాణికుల సంక్షేమార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దసరా ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో సజ్జనార్‌ మాట్లాడుతూ.. టీజీఎస్‌ఆర్టీసీలో అనుభవం గల డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తారని, అందుకే ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని సూచించారు. ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ ఉండే అవకాశం ఉందని, 6304 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ‘మహాలక్ష్మి’ పథకం దృష్ట్యా గత ఏడాదితో పోల్చితే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.