Chicken Price Today: పండగపూట కొండెక్కిన ‘కోడి’.. భగ్గు మంటున్న చికెన్‌ ధరలు

దసరా నవరాత్రులు తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రత్యేకం. ఈ పండుగను పెద్దల పండుగ అని కూడా అంటారు. సాధారణంగా దసరా పండగ రోజు అన్ని ఇళ్లల్లో రకరకాల మాంసం వంటకాలు చేస్తుంటారు. శనివారం దసరా పండగ రావడంతో చాలా మంది నాన్‌ వెజ్‌ జోటికి పోలేదు. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో..

Chicken Price Today: పండగపూట కొండెక్కిన 'కోడి'.. భగ్గు మంటున్న చికెన్‌ ధరలు
Chicken Price
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 13, 2024 | 11:07 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 13: దసరా నవరాత్రులు తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రత్యేకం. ఈ పండుగను పెద్దల పండుగ అని కూడా అంటారు. సాధారణంగా దసరా పండగ రోజు అన్ని ఇళ్లల్లో రకరకాల మాంసం వంటకాలు చేస్తుంటారు. శనివారం దసరా పండగ రావడంతో చాలా మంది నాన్‌ వెజ్‌ జోటికి పోలేదు. ఇక ఈ రోజు ఆదివారం కావడంతో మాంసం ప్రియులు చికెన్, మటన్‌ షాపుల ఎదుట క్యూ కట్టారు. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మార్కెట్లలో రద్దీ నెలకొంది. ఇక మార్కెట్‌కి వెళ్లాక ఈ రోజు ధరలు చూసి అంతా అవాక్కవుతున్నారు. అధిక మంది ఇష్టంగా ఆరగించే చికెన్‌ అందనంత ఎత్తుకు చేరుకుంది. దాదాపు అన్ని చోట్ల ధరలు ఒకేలా ఉన్నాయి.

స్కిన్ లెస్ చికెన్ ధర ఏకంగా రూ.240 నుంచి రూ.260 వరకు పలుకుతుంది. దీంతో కొనుగోలు దారులు పరేషాన్‌ అవుతున్నారు. అక్టోబర్‌ నెలారంభంలో కేలో చికెన్ ధర రూ. 160 నుంచి రూ.180 వరకు పలికింది. ఇక అక్టోబర్‌ నెలంతా రూ.200లోపే ఉంది. ఇక వారం రోజులుగా రూ.230 వరకూ ఉన్న చికిన్‌ ధర.. ఈ రోజు అమాంతం రూ.260కు చేరుకుంది. మరికొన్ని చోట్ల వ్యాపారులు కిలో చికెన్‌ రూ.300 వరకు విక్రయిస్తున్నారు.

ఓ వైపు పెరిగిన కూరగాయలు, ఆయిల్, బియ్యం, పప్పుఉప్పూ వంటి నిత్యావసర సరుకుల ధరలతో సామాన్యుడు తల్లడిల్లిపోతుంటే.. పండగవేళ చికెన్‌ ధరలు కూడా అందనంత ఎత్తుకు చేరడంతో సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. చికెన్‌ ధరలను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారని, పండగ పూట కూడా ఇదేం లొల్లి అంటూ మాంసప్రియులు కొంత నిరాశకు గురవుతున్నారు. కాగా రానున్న రోజుల్లో ఈ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని హోల్‌ సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. మరి కొంతమంది మాత్రం ధరలు ఎంత ఉన్నా.. డోంట్‌ కేర్‌ అనేలా ఎంచక్కా కొనేసి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి అన్ని మార్కెట్లలో జనాలు కిటకిటలాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.