Alai Balai Live: దసరా సందడి.. ఘనంగా దత్తన్న ‘అలయ్ బలయ్’.. అతిథుల కోసం 150 రకాల వంటకాలు
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం సందడిగా మొదలయింది. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా ప్రతిఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ..

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం సందడిగా మొదలయింది. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది. దసరా పండుగ సందర్భంగా ప్రతిఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ.. ఆయన ఆధ్వర్యంలో 19వ సారి అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది.. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హాజరయ్యారు..
ఈ ఏడాది అలాయ్ బలాయ్ కార్యక్రమానికి అతిథులుగా 4 రాష్ట్రాల గవర్నర్లతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక బృందాలతో అతిథులను స్వాగతించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వీడియో..
తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.. అతిథుల కోసం 150 రకాల వంటకాలు సిద్ధమయ్యాయి. అలాగే తెలంగాణ సంప్రదాయ వృత్తులను ప్రతిబింబిస్తూ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు.
లైవ్ వీడియో చూడండి..
రాజకీయాలకు ఆతీతంగా ప్రతి ఏటా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వాహకులు రాజకీయ ప్రముఖులకే పరిమితం చేశారు. సినీ ప్రముఖులకు మాత్రం ఆహ్వానం పంపలేదు. దీంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
