Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సమయం లేదు మిత్రమా.. 60 రోజులే గ్యాప్.. ఆ లెక్క తేలగానే పంచాయతీ సమరం..

రెండునెలల తర్వాత ఏ క్షణాన్నయినా టీ-దంగల్. మూడు ప్రధాన పార్టీల మధ్య నయా వెర్షన్‌తో రసవత్తర పోరు. అవును.. మీరు వింటున్నది నిజమే.. జస్ట్ 60 రోజుల తర్వాత తెలంగాణలో రాజకీయ రణరంగం షురూ కాబోతోంది. లోకల్‌వార్ కమింగ్‌సూన్.. మేం రెడీ.. మీరు రెడీనా అంటూ మిగతా పార్టీలకు ఓపెన్ ఛాలెంజ్ విసరబోతోంది రూలింగ్ పార్టీ.

Telangana: సమయం లేదు మిత్రమా.. 60 రోజులే గ్యాప్.. ఆ లెక్క తేలగానే పంచాయతీ సమరం..
Panchayat Local Body Elections
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 13, 2024 | 1:04 PM

రెండునెలల తర్వాత ఏ క్షణాన్నయినా టీ-దంగల్. మూడు ప్రధాన పార్టీల మధ్య నయా వెర్షన్‌తో రసవత్తర పోరు. అవును.. మీరు వింటున్నది నిజమే.. జస్ట్ 60 రోజుల తర్వాత తెలంగాణలో రాజకీయ రణరంగం షురూ కాబోతోంది. లోకల్‌వార్ కమింగ్‌సూన్.. మేం రెడీ.. మీరు రెడీనా అంటూ మిగతా పార్టీలకు ఓపెన్ ఛాలెంజ్ విసరబోతోంది రూలింగ్ పార్టీ. తెలంగాణలో సడన్‌గా ఎన్నికల హీట్‌ ఎలా మొదలైంది.. దీనికి రూట్ కాజ్ ఏంటి..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.. జీవో నంబర్ 18ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణన చేస్తున్నామని, 60 రోజుల పాటు జరిగే సర్వేతో… స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకం తొలగిపోతుందని క్లారిటీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్.. అంటే.. రెండు నెలల తర్వాత పంచాయతీ పోరు తప్పకుండా జరుగుతుందంటూ చెప్పకనే చెప్పారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే… తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. ‘రాష్ట్రంలో బీసీల లెక్క తేలాల్సిందే.. వాళ్లకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందే’ అని ఎన్నికలకు ముందునుంచీ చెబుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆ దిశగా క్రియాత్మకంగా వేసిన అడుగు ఇది. ఫిబ్రవరి 4న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ వెంటనే అసెంబ్లీ ఆమోదించింది. బిహార్‌లో చేపట్టిన కుల సర్వేను కూడా పరిశీలించింది. కానీ.. సర్వే చెయ్యడానికి సరిపడా యంత్రాంగం తమ వద్ద లేదని బీసీ కమిషన్ వెనక్కు తగ్గడంతో.. ప్రణాళిక విభాగం సపోర్ట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇంటింటికీ తిరిగి 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు జీవో 18 జారీ చేసింది ప్రభుత్వం. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కులాల పరంగా లెక్క తేల్చడానికి ఈ సర్వే ఉపయోగపడుతుంది.

విమర్శలతో ప్రభుత్వం క్లారిటీ..

లోకల్‌బాడీ ఎలక్షన్స్‌కి సంబంధించి.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఇటీవల విమర్శలొచ్చాయి. వాటన్నిటినీ కొట్టిపారేస్తూ.. కులగణన తర్వాత ఎన్నికలు జరుగుతాయని హింట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రెండునెలల తర్వాత.. ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలుకావొచ్చని పొన్నం మాటల ద్వారా స్పష్టమైంది.

వీడియో చూడండి..

ఎన్నాళ్లో ఎదురుచూసిన కులగణన.. ఎట్టకేలకు మొదలుకావడంతో బీసీ సంక్షేమ సంఘం కూడా హర్షం వ్యక్తం చేసింది. రెండునెలల్లో సర్వే పూర్తయ్యి.. నివేదిక సిద్ధమై.. బీసీల జనాభాపై క్లారిటీ వస్తే.. దానికి తగ్గట్టు స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారయ్యే ఛాన్సుంది. బీసీలకు రాజకీయ అవకాశాల్ని పెంచింది మేమే అనే నినాదంతో లోకల్‌వార్‌కి సిద్ధం కావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. సో… ఎక్స్‌ట్రాగా యాడయ్యే బీసీ ఫ్లేవర్‌తో మూడు పార్టీల మధ్య స్థానిక సమరం మరింత రంజుగా మారే ఛాన్సుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..