Watch Video: వీధిలో నడుస్తున్న మహిళపై హఠాత్తుగా పడిన వాటర్ ట్యాంక్.. వీడియో వైరల్
ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఏ వైపు నుంచి మృత్యువు కబలిస్తుందో కూడా అంచనా వేయలేం. తెలిస్తే.. జాగ్రత్త పడిపోతాంగా.. అందుకే విధి ఆడే వింత నాటకంలో మన ప్రాణాలు గాల్లో దీపాలే అనడంలో సందేహం లేదు. తాజాగా ఓ మహిళ తన ఇంటి ముందున్న వీధిలో నడుస్తూ వెళ్తుంది..
ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. ఏ వైపు నుంచి మృత్యువు కబలిస్తుందో కూడా అంచనా వేయలేం. తెలిస్తే.. జాగ్రత్త పడిపోతాంగా.. అందుకే విధి ఆడే వింత నాటకంలో మన ప్రాణాలు గాల్లో దీపాలే అనడంలో సందేహం లేదు. తాజాగా ఓ మహిళ తన ఇంటి ముందున్న వీధిలో నడుస్తూ వెళ్తుంది. ఇంతలో ఎక్కడి నుంచి ఊడిపడిందో తెలియదుగానీ ఓ వాటర్ ట్యాంక్ ఆమాంతం ఆమెపై పడింది. కానీ ఆవగింజంత అదృష్టం ఉన్నా ప్రాణాలతో బయటపడొచ్చన్న సామెత ఈమె విషయంలో రుజువైంది. అంత ఎత్తు నుంచి అంత పెద్ద వాటర్ ట్యాంక్ పడ్డా ఆమె ఒంటిపై కనీసం చిన్న గీత కూడా పడలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
ఈ వీడియోలో ఓ మహిళ ఇంటి ముందున్న మరో మహిళతో మాట్లాడుతూ ఉండటం కనిపిస్తుంది. అనంతరం ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటుంది. తెలిసిన దారి కావడంతో దిక్కులు చూడకుండా ఆమె తల దించుకుని వెళ్తుంటుంది. ఇంతలో ఓ భారీ సైజులో ఉన్న వాటర్ ట్యాంక్ అమాంతం ఆమెపై పడటం వీడియోలో చూడొచ్చు. అయితే సమయానికి వాటర్ ట్యాంకులో నీళ్లు లేకపోవడం ఓ ఎత్తైతే.. సరిగ్గా ఆమెపై పడిన ట్యాంకు అడుగు భాగంలో లోపలికి రంధ్రం ఉంది. దీంతో ఆ ప్లాస్టిక్ వాటర్ ట్యాంకు అడుగు భాగంలో ఉన్న రంధ్ర మధ్యలో మహిళ పడుతుంది. అంటే వాటర్ ట్యాంక్ ఆమెపై పడటంతో ఆ రంధం గుండా ఆమె దానిలో ఇరుక్కు పోయిందన్న మాట. అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.
An apple a day keeps the doctor away. pic.twitter.com/ugvzXYKDxq
— Hemant Batra (@hemantbatra0) October 13, 2024
భారీ శబ్ధం రావడంతో ఎదురింటి వ్యక్తి పరుగు పరుగున వచ్చి ఆమెపై పడిన ట్యాంకును తొలగించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైనుంచి ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ ఆ మహిళపై పడినట్లు తెలుస్తుంది. మనిషి ఎత్తు అంత ఉన్న ఆ వాటర్ ట్యాంకు ఆమె తలపై పడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ పడిన ఎదురింటి వారిపై అక్కడి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందనే సంగతి స్పష్టంగా తెలియరాలేదు.