Viral video: నల్ల తేలును గుట్టుక్కున మింగేద్దామనుకున్న కట్లపాము.. కట్ చేస్తే..

ఏ ఆహారం దొరక్కపోవడంతో కట్లపాము చివరకు కనిపించిన తేలునే టార్గెట్ చేస్తుంది. ఎలాగైనా తేలును మింగేసి, ఆకలి తీర్చుకోవాలని ప్రయత్నించింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది...

Viral video: నల్ల తేలును గుట్టుక్కున మింగేద్దామనుకున్న కట్లపాము.. కట్ చేస్తే..
Snake Vs Scorpion
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 14, 2024 | 6:16 PM

పాములు చాలా ప్రమాదకర జీవులు. అయితే అన్ని పాములు డేంజరస్ కాదు. తాచుపాము, రక్త పింజర, కట్లపాము వంటివి మాత్రం చాలా డేంజర్. ముఖ్యంగా కట్ల పాము కాటు వేసిందంటే… మరణానికి చేరువైనట్లే. కట్లపాము కాటేసిన చోట గాట్లు చాలా సన్నగా ఉంటాయి.  ఈ పాము విషం నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఈ స్నేక్‌తో పెను ప్రమాదం ఏంటి అంటే.. చనిపోయాక కూడా చాలాసే దాని నాడీ మండలం చురుగ్గానే ఉంటుంది. తాజాగా కట్లపాముకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  పంది కొక్కుల్ని ఇష్టంగా తినే కట్లపాము.. ఆకలితో ఓ నల్ల తేలును ఆహారంగా మలచుకోవాలని భావించింది. కానీ తేలుతో అంత ఈజీ కాదు కదా…

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలో కట్ల పాము ఆహారం కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దానికి ఓ పెద్ద తేలు కనిపించడంతో ఏ మాత్రం ఆలోచించకుండా దాన్ని వేటాడింది. ఎలాగైనా దాన్ని మింగి దాని పొట్ట నింపుకోవాలని భావించింది. అనుకున్నట్లుగానే దాన్ని నోటితో పట్టేసింది. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.

తేలుపై దాడి చేసి మింగేయాలని చూసిన పాముకు చుక్కెదురైంది. తల భాగాన్ని మింగగానే తేలును తన ముందు కొండిలతో పామును గట్టిగా అదిపట్టింది. దీంతో తేలును దాన్ని మింగడం సాధ్యం కాలేదు. మింగేయాలని ఎంత ప్రయత్నించినా వీలు చిక్కలేదు. ఇలా వాటి మధ్య చాలా సేపు టఫ్ ఫైట్ నడిచింది. అయితే చివరికి ఏం జరిగిందో తెలుసుకుందామనుకుంటే.. వీడియో అసంపూర్ణంగా ముగిసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘‘తేలుపై పాము దాడి చేయడం చాలా అరుదు’’ అని ఒకరు కామెంట్ పెట్టారు.

వీడియో దిగువన చూడండి…

View this post on Instagram

A post shared by @rijeshkv_80

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి