TG Weather Report: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 5 రోజులపాటు వానలే వానలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ..

TG Weather Report: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 5 రోజులపాటు వానలే వానలు
TG Rains
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 14, 2024 | 5:55 PM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారుతున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపటికి ఈ అల్పపీడనం తీవ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉదయం నాటికి మధ్యబంగాళాఖాతం చేరే అవకాశం ఉందని చెప్పింది. ఆ తర్వాత రెండురోజుల్లో మరింత ముందుకు కదులుతూ పశ్చిమ వాయువ దశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

అల్పపీడన ప్రభావంతో ఈ రోజు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నిర్మల్‌, నిజామాబాద్‌, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

మరోవైపు అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.