AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికొచ్చిన మహిళ.. ఎక్స్‌రేలో కనిపించింది చూడగా

నోయిడాకు చెందిన ఓ మహిళ గత కొన్ని రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఎన్ని మందులు వాడినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఇక చివరాఖరికి ఓ ఆసుపత్రిలోకి వెళ్లగా.. అక్కడి డాక్టర్లు ఆమెను పరీక్ష చేసి చూశారు. వారికి ఆమె ఎక్స్‌రేలో కనిపించింది చూడగా.. దెబ్బకు షాక్ అయ్యారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?

Viral: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికొచ్చిన మహిళ.. ఎక్స్‌రేలో కనిపించింది చూడగా
Representative Image
Ravi Kiran
|

Updated on: Nov 09, 2024 | 4:17 PM

Share

తన కడుపులో 9 అంగుళాల పైపు ఉందని వైద్యులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. 2023లో నోయిడాలోని సెక్టార్ 51లో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు తనకు శస్త్రచికిత్స నిర్వహించగా.. ఆ సమయంలో తన పొత్తికడుపులో 9.05 అంగుళాలు పొడవాటి పైపును వదిలిపెట్టారని పేర్కొంది. ఈ ఘటన ఢిల్లీలోని నోయిడాలో చోటు చేసుకోగా.. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్టార్ 49 పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్న తర్వాతే డిశ్చార్జ్ చేశామని చెబుతూ.. ఆమె ఆరోపణలు ఖండించారు ఆ ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లు.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

వివరాల్లోకి వెళ్తే.. కిరణ్ నేగి అనే సదరు మహిళ ఫిబ్రవరి 2023లో తన గర్భాశయంలో పెరిగిన కణితులను తొలగించుకునేందుకు శస్త్రచికిత్స చేయించుకుంది. ఇక ఆ ఆపరేషన్ అనంతరం ఆమె నిరంతరం తీవ్రమైన కడుపునొప్పి వస్తూనే ఉంది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా.. మందులు వాడినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.ఇక సుమారు ఆరేడు నెలల తర్వాత సెక్టార్ 19లోని ప్రైవేటు ఆస్పత్రిలో మరో శస్త్రచికిత్స చేయించుకుంది. ఆ సమయంలోనే వైద్యులు ఆమె పొత్తికడుపులో ఉన్న 9.05 అంగుళాల పొడవైన పైపును తొలగించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన

మొదట శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ.. ఆ సమయంలో ఓ సమస్య తలెత్తిందని.. ఆ తర్వాత దాన్ని తొలగించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తనకు భరోసా ఇచ్చినట్టు సదరు మహిళ చెప్పుకొచ్చింది. కానీ డిశ్చార్జ్ అనంతరం కడుపునొప్పి మొదలై.. నిరంతరం వస్తూనే ఉందని చెప్పింది. ఇక ఆరేడు నెలల తర్వాత అనగా అక్టోబర్ 2023లో మరో ఆస్పత్రిలోని వైద్యులు తన పొత్తికడుపులో నుంచి ఆ పైపును తొలగించారని తెలిపింది. దీన్ని బట్టే మహిళ మొదట ఆపరేషన్ చేసిన వైద్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. కేసు పెట్టింది. అయితే మొదట శస్త్రచికిత్స చేసిన ఆస్పత్రి వైద్యుల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. రోగి ఆరోగ్యకరంగానే డిశ్చార్జ్ అయిందని.. తన డ్రెయిన్ పైపు ఎక్కడో పగలగోట్టుకుని.. తమను పరిహారం చెల్లించాలని బెదిరిస్తోందని అంటున్నారు.

ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్‌ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..