ముఖంలో చెరగని బోసినవ్వు.. జోరు వర్షంలోనూ కూరగాయలు అమ్ముతున్న వృద్ధురాలు.. బూస్టర్‌డోస్ ఇదేనంటున్న నెటిజన్లు!
ఈ అవ్వ కష్టం మూమూలు కష్టం కాదు.. ఇది అందరికీ అంత తేలిక కాదు, అంతటి కష్టంలోనూ ఆమె ముఖంలోని చిరునవ్వు ఆమె బలాన్ని తెలియజేస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒకరూ ఆ వృద్ధురాలిని ప్రశంసిస్తున్నారు.
జీవితంలో చిన్న చిన్న సమస్యలకే బాధపడిపోతూ, కుంగిపోతూ, ప్రాణత్యాగాలకు పాల్పడుతుంటారు చాలా మంది. కానీ, కష్టాలు అందరికీ ఉన్నాయి. ఎవరి స్థాయిలో వారు కష్టపడుతున్నారు. ఫెమినిజం గురించి ఉత్సాహంగా మాట్లాడే నేటి కాలంలో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఓ వృద్ధురాలు నిజమైన స్త్రీవాదానికి తానే ఉదాహరణ అని నిరూపించుకుంటోంది. బతుకుదెరువు కోసం కూరగాయలు అమ్ముకుంటున్న ఆమె సుమారు 80 ఏళ్లకు పైనే ఉంటుంది. అంత వయసు పైబడిన ఆ అవ్వ పడుతున్న కష్టం ప్రతి ఒక్కరినీ కదిలింప జేసేలా ఉంది. వైరల్ వీడియోలో జోరు వర్షంలో గొడుగు కింద కూరగాయలు అమ్ముతున్న ఓ అవ్వ కనిపిస్తుంది. ఆమె కష్టానికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందే.
ఒకరిపై ఆధారపడకుండా వృద్ధాప్యంలో కూడా కొంతమంది కష్టపడి పని చేస్తుంటారు. సరిగ్గా అలాంటి వీడియోనే ఇది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వృద్ధురాలు రాత్రి వేళ రోడ్డు పక్కన కూర్చుని కాయగూరలు అమ్ముకుంటోంది. ఆ సమయంలో వర్షం పడుతోంది. వర్షంలో తడుస్తూనే ఆమె కూరలు అమ్ముకుంటోంది. వర్షంలో కూడా తన పని చేసుకుంటున్న ఆమెను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక్కడ క్లిక్ చేయండి..
దాదాపు 13 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెట్టింట దుమ్ములేపుతోంది. కోటి మందికి పైగా ఈ వీడియోని వీక్షించారు. ఈ వీడియోలో వృద్ధురాలు తనను కెమెరాలో రికార్డ్ చేస్తున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఈ అవ్వ కష్టం మూమూలు కష్టం కాదు.. ఇది అందరికీ అంత తేలిక కాదు, అంతటి కష్టంలోనూ ఆమె ముఖంలోని చిరునవ్వు ఆమె బలాన్ని తెలియజేస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒకరూ ఆ వృద్ధురాలిని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..