Watch: వార్నీ.. ఆన్‌లైన్‌లో ఎంగేజ్ మెంట్‌..! డిజిటల్‌ ఇండియా అంటే ఇదేనా బాస్‌..?

ఒక అమ్మాయి ఫైబర్ కుర్చీపై కూర్చుని ఉంది. నుదుటిపై తిలకం పూసారు. ఆ పక్కనే మరో కూర్చీలో అత్యంత షాకింగ్ ఘటన కనిపించింది. అక్కడ కూర్చీలో ఫోన్‌ కెమెరాలో ఒక యువకుడి చిన్న ఫ్రేమ్ ఫోటో ఉంచారు. ఆ ఫోటో చుట్టూ చాలా నోట్ల కట్టలు కూడా కనిపిస్తున్నాయి.

Watch: వార్నీ.. ఆన్‌లైన్‌లో ఎంగేజ్ మెంట్‌..! డిజిటల్‌ ఇండియా అంటే ఇదేనా బాస్‌..?
Online Engagement
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 07, 2024 | 8:38 PM

కరోనా కాలం మనిషిని ఎంతగానో మార్చేసింది. ఆన్‌లైన్‌ వర్క్ ట్రెండ్‌ పెరిగింది. ఆన్‌లైన్‌లో కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు.. ఏకం పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి కూడా జరిపించేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ జంట ఆన్‌లైన్‌లో నిశ్చితార్థం చేసుకోవడం కనిపించింది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అమ్మాయి ఉంది.. కానీ అబ్బాయి మాత్రం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాడు. అలాగే, నిశ్చితార్థం కొనసాగించారు ఇరువురి తల్లిదండ్రులు, బంధుమిత్రులు. ఈ వింత వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ ఇంటర్నెట్ వినియోగదారులను విస్మయానికి గురి చేస్తోంది. navvarababu_Instagram ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఒక అమ్మాయి ఫైబర్ కుర్చీపై కూర్చుని ఉంది. నుదుటిపై తిలకం పూసారు. ఆ పక్కనే మరో కూర్చీలో అత్యంత షాకింగ్ ఘటన కనిపించింది. అక్కడ కూర్చీలో ఫోన్‌ కెమెరాలో ఒక యువకుడి చిన్న ఫ్రేమ్ ఫోటో ఉంచారు. ఆ ఫోటో చుట్టూ చాలా నోట్ల కట్టలు కూడా కనిపిస్తున్నాయి. బహుశా ఈ డబ్బు కట్నం కావచ్చు. వీడియోను షేర్‌ చేస్తూ..దానికి క్యాప్షన్ కూడా ఇచ్చారు..ఇది కదా డిజిటల్ ఇండియా అంటే.. అని రాశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

View this post on Instagram

A post shared by Navvara babu (@navvarababu_)

navvarababu_Instagram ఖాతాలో 15 రోజుల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో వేగంగా వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇలాంటి పెళ్లిళ్లు, పెళ్లి చూపులు, నిశ్చితార్థాల ట్రెండ్‌ కొనసాగుతోందని మరికొందరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..