వీధి కుక్కలకు చట్టాలు ఉన్నాయి.. వాటిని చులకనగా చూస్తే చట్ట ఉల్లంఘనే.. 

Stray Dogs Laws: వీధి కుక్కలా కోసం నిర్దిష్టమైన చట్టాలు ఉన్నాయి అది మీకు తెలుసా..? అంతే కాదు, రాజ్యాంగ రక్షణ కూడా వాటికి ఉంది. ఐ.పి.సి. సెక్షన్ 428, 429 ప్రకారం కమ్యూనిటీ జంతువులు లేదా పెంపుడు జంతువుల పట్ల స్థానభ్రంశం, అపహరణ, క్రూరత్వ చర్యలకు పాల్పడే వ్యక్తులకు తీవ్రమైన శిక్షను అమలు చేస్తారు. కనీసం అయిదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఢిల్లీ పోలీసు చట్టం 1968, సెక్షన్లు 73 నుండి 79, 99.. జంతువులపై నేరం జరిగినప్పుడు చర్య తీసుకునేందుకు పోలీసులకు ప్రత్యేక అధికారాలను కల్పించారు..

వీధి కుక్కలకు చట్టాలు ఉన్నాయి.. వాటిని చులకనగా చూస్తే చట్ట ఉల్లంఘనే.. 
Stray Dogs
Follow us
M Sivakumar

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 17, 2023 | 11:25 AM

విజయవాడ, సెప్టెంబర్ 17: వీధి కుక్కలకు ఫీడింగ్ చేసేవారికి రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు కీలక ఉత్వర్వులు జారీ చేసింది. విధి కుక్కలకు ఆహరం పెట్టే వ్యక్తికి ఎవరైనా పరిమితులు విధించినా  లేదా అసౌకర్యానికి గురి చేసిన పక్షంలో దానికి శిక్షార్హమైన నేరంగా మార్చింది. సెక్షన్ 503 ఇండియన్ పీనల్ కోడ్ యాక్ట్ 1860 బెదిరింపు అనేది ఒక క్రిమినల్ నేరంగా పరిగణించబడుతుంది. సెక్షన్ 503 ప్రకారం అలాంటి వ్యక్తులు తమ నేరపూరిత బెదిరింపులకు బాధ్యత వహిస్తారు. అంతేకాదు అలాంటి చర్యకు పాల్పడితే.. అరెస్టు చేసే అవకాశం కూడా  ఉంది. సెక్షన్ 506 జంతువులకు ఆహారం పెట్టే వారిని.. పొరుగు వారు బెదిరించడం, అధికార దుర్వినియోగం చేయడం లేదా వేధించడం.. నేరంగా పరిగణిస్తారు. ఐ.పి.సి. సెక్షన్ 428, 429 ప్రకారం కమ్యూనిటీ జంతువులు లేదా పెంపుడు జంతువుల పట్ల స్థానభ్రంశం, అపహరణ, క్రూరత్వ చర్యలకు పాల్పడే వ్యక్తులకు తీవ్రమైన శిక్షను అమలు చేస్తారు. కనీసం 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఢిల్లీ పోలీసు చట్టం 1968, సెక్షన్లు 73 నుండి 79, 99.. జంతువులపై నేరం జరిగినప్పుడు చర్య తీసుకునేందుకు పోలీసులకు ప్రత్యేక అధికారాలను కల్పించారు.

జంతువులపై నేరం జరిగినప్పుడు చర్య తీసుకునేందుకు పోలీసులకు ప్రత్యేక అధికారాలను కల్పించారు. జంతు హింస నివారణచట్టం-1960 సెక్షన్ 11 ప్రకారం అన్ని జంతు హింసలు క్రిమినల్ నేరంగా పరిగణనలోకి వస్తాయి. ఇందుకు జైలు, జరిమానా విధిస్తారు. భారతీయ శిక్షాస్మృతిలో సైతం ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ (కు) రూల్స్, 2001 జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద రూపొందించబడ్డాయి. వీధికుక్కల జనాభాను స్థిరీకరించడానికి/తగ్గించడానికి, రేబిస్ ప్రమాదాన్ని తొలగించడానికి ఒక సాధనంగా స్టెరిలైజేషన్, టీకాల ప్రక్రియ అమలవుతోంది. వీధికుక్కల పునరావాసాన్ని నిషేధిస్తుంది, అనగా వాటిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి విసిరేయడం లేదా తరిమివేయడం. ఈ విషయంలో భారత సర్వోన్నత న్యాయస్థానం ఆమోదించిన ఒక ఉత్తర్వు, అన్ని కుక్కలను తొలగించడం, స్థానభ్రంశం చేయడం లేదా చంపడం నిషేధించబడింది.

స్ట్రే డ్రాగ్ మేనేజ్మెంట్ రూల్స్ 2001 ప్రకారం, ఒక వ్యక్తి, లేదా ఎస్టేట్ మేనేజ్మెంట్ కుక్కలను నిర్ములించడం లేదా వాటి టెరిటరీ నుండి తరలించడం చట్టవిరుద్ధం. కుక్కలకు స్టెరిలైజ్ చేసి టీకాలు వేసి తిరిగి అదే ప్రాంతానికి పంపించాలి. టీకాలు వేసిన, స్టెరిలైజ్ చేసిన కుక్కలను గ్రామపంచాయతీలు, నగర పాలక సంస్థలు. మున్సిపాలిటీ లు కూడా నిర్ములించే వీలు అస్సలు లేదు. ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ మరియు యానిమల్ ఫీడర్లకు భద్రత అందించడానికి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు లేదా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల వంటి సంస్థలు కుక్కలకు తిండి పెట్టే వ్యక్తులను వేధించడం నిరోధించడం, పరిమితం చేయడం శిక్షర్హ నేరం.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో ఎక్కడైనా కుక్కలను చంపటం లేదా తొలగించడం లేదా స్థానభ్రంశం చేయడంపై భారత సుప్రీంకోర్టు ఇదే విధమైన స్టే ఆర్డర్ ఇచ్చింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి కాబట్టి జంతు ప్రేమికులు రాజ్యాంగం రక్షణ పరిధి లోకి వస్తారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, స్వేచ్ఛ హక్కుతో వ్యవహరిస్తుంది. ఈ స్వేచ్ఛలో వృత్తి, వ్యాపారం చేసుకొనే హక్కు వస్తుంది. అంటే ఎవరైనా జంతువుల సంరక్షణను తన వృత్తిగా తీసుకున్నట్లయితే, అది చట్టబద్ద అవుతుంది.  రాజ్యాంగంలోని ఆరికల్ 21 వ్యక్తిగత జీవితం స్వేచ్ఛ హక్కును తెలియజేస్తుంది. ఎవరైనా కుక్కలకు ఆహారం, ఆశ్రయం కల్పించాలనుకుంటే, అతను మె అలా చేయడానికి పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. భారతదేశంలోని ప్రతి పౌరునికి రాజ్యాంగం, చట్టాలు జంతు సంరక్షణ విషయంలో స్పష్టమైన స్వేచ్ఛ, హక్కు కల్పించాయి. వాటికీ జీవించే హక్కు ఉందనే విషయాన్నీ సుస్పష్టంగా నిర్ధారించాయి.

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..