Andhra Pradesh: ‘తప్పుకదా.. మాస్టారూ!’ విద్యార్ధుల చేతులతో టాయిలెట్స్ శుభ్రం చేయించిన ఉపాధ్యాయుడు
అభంశుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించవల్సిన ఉపాధ్యాయులు నిర్ధాక్షిణ్యంగా మరుగు దొడ్లు కడిగించారు. అదీ చేతులతో శుభ్రం చేయించి సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. చిన్నారి విద్యార్థుల చేతులతో మరుగుదొడ్డిని శుభ్రం చేయిస్తున్న ఫొటోలు, వీడియో బయటికి పొక్కడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరు ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. ఈ ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు తరగతులకు సంబంధించి 15 మంది విద్యార్థులు అక్కడ..
తిరుపతి, సెప్టెంబర్ 17: అభంశుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించవల్సిన ఉపాధ్యాయులు నిర్ధాక్షిణ్యంగా మరుగు దొడ్లు కడిగించారు. అదీ చేతులతో శుభ్రం చేయించి సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. చిన్నారి విద్యార్థుల చేతులతో మరుగుదొడ్డిని శుభ్రం చేయిస్తున్న ఫొటోలు, వీడియో బయటికి పొక్కడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరు ప్రాథమిక పాఠశాలలో శనివారం ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. ఈ ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ రెండు తరగతులకు సంబంధించి 15 మంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. విద్యార్ధులంతా వినియోగించుకునే మరుగుదొడ్డిని అక్కడి ఉపాధ్యాయులు నిత్యం చిన్నారులతోనే శుభ్రం చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు బయటికి రావడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల నిర్వాకంపై ఎంఈవో లక్ష్మీపతికి విద్యార్ధుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ కోరగా సంఘటనపై పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పెళ్లయిన నాలుగు నెలలకే పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
మెదక్, సెప్టెంబర్ 17: పెద్దయ్యాక పోలీస్ ఉద్యోగం చేయాలని ఆమె కలలు కనింది. రాత్రింబవళ్లు శ్రమించి కోరుకున్నట్లుగానే పోలీస్ కొలువు సాధించింది. తల్లిదండ్రులు మంచి వరుడుని చూసి పెళ్లి కూడా చేశారు. కలకాలం పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తుందినే అని అనుకున్నారంతా. అయితే పెళ్లైన నాలుగు నెలలకే అంతా ముగిసిపోయింది. పట్టుదలతో సాధించుకున్న ఉద్యోగం వదిలేయమని నిత్యం అత్తింటివారి పోరుపడలేక ఉరి వేసుకుని తనువు చాలించింది. ఈ విషాద ఘటన ఘటన నంగునూరు మండలం గట్లమల్యాలలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రాజగోపాలపేట ఠాణా ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..
మెదక్ జిల్లా ఘటన నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన కారు హరీశ్‌తో.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మార్త రాజయ్య కుమార్తె కళ్యాణికి 4 నెలల క్రితం వివాహం జరిగింది. కళ్యాణి ఎంబీఏ పూర్తి చేసింది. అనంతరం కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పరీక్షలు అందులో అర్హత సాధించింది. ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఎక్కువ రోజులు లేకుండానే అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. పోలీస్ ఉద్యోగం చేయడానికి వీళ్లేదంటూ భర్త హరీశ్, అత్త రమణ, మరిది శ్రీహరి నిత్యం వేధించసాగారు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వేధింపులు తాళలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి రాజయ్య రాజగోపాలపేట ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై మోహన్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.