Ganesh Chaturthi: మల్లన్న ఆలయ ప్రాంగణంలో పురాతన రత్న గర్భ వినాయకుడు.. వినాయక చవితి ముస్తాబవు
శ్రీశైలం ఆలయంలోకి ప్రవేశించగానే స్వామివారికి కుడివైపున ఈ రత్నగర్భ వినాయకుడికి దర్శనం చేసుకుని తర్వాత భక్తులందరూ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం అలవాయితీగా వస్తోంది. అలాంటి రత్నగర్భ వినాయకుడు.. వినాయక చవితి సందర్భంగా మరింత దేదీప్యమానంగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. రత్నగర్భగణపతి స్వామివారి ఆలయ ముఖమండపంలోని నైరుతి భాగంలో నాలుగు అడుగుల ఎత్తుగల గణపతి దర్శనమిస్తాడు.
శక్తి పీఠం జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైల మహా క్షేత్రం. అతి ప్రాచీన పురాతన శైవ క్షేత్రం. అలాంటి శ్రీశైలంలో బ్రమరాంబ మల్లికార్జున స్వామికి కుడివైపున ఉన్న వినాయకుడే రత్నగర్భ వినాయకుడు. మల్లికార్జున స్వామి ఏర్పడినప్పటి నుంచి రత్నాగర్భ వినాయకుడు కూడా పూజలు అందుకుంటున్నట్లు అతి ప్రాచీన కాలం నుంచి ఈ విగ్రహం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీశైలం ఆలయంలోకి ప్రవేశించగానే స్వామివారికి కుడివైపున ఈ రత్నగర్భ వినాయకుడికి దర్శనం చేసుకుని తర్వాత భక్తులందరూ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం అలవాయితీగా వస్తోంది. అలాంటి రత్నగర్భ వినాయకుడు.. వినాయక చవితి సందర్భంగా మరింత దేదీప్యమానంగా భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు
శ్రీశైలం రత్నగర్భగణపతి స్వామి విశేషం
రత్నగర్భగణపతి స్వామివారి ఆలయ ముఖమండపంలోని నైరుతి భాగంలో నాలుగు అడుగుల ఎత్తుగల గణపతి దర్శనమిస్తాడు. ఈ స్వామికి రత్నగర్భగణపతి అని పేరు. ఏకదంతాన్ని, అంకుశాన్ని అట్లే ఎడమవైపున మోదకాన్ని, పాశాన్ని ధరించివున్నాడు. కిరీట మకుటాన్ని కలస్వామి కంఠాభరణాలను, హస్తాభరణాలను కలిగివుండి, పాదాలకు నూపురాలను కూడా ధరించివున్నాడు. స్వామికి యజ్ఞోపవీతం, నాగ ఉదరబంధం ఎంతో అలంకారయుక్తంగా మలచబడ్డాయి. స్వామికి వెనుక అలంకారిక తోరణం కూడా చెక్కబడివుంది. ఈ గణపతికి వెండిమండపం ఏర్పాటు చేయబడివుంది. ఆగమశాస్త్ర ప్రకారంగా చింతామణి గణపతి అన్నా, రత్నగర్భగణపతి అన్నా ఒకటే మణులన్ని లోపల పెట్టకున్నాడు. చింతామణి అంటే ఏది చింతన చేస్తే అది ఇచ్చే మణి అభీష్టసిద్ధికారకుడు. అష్టాదశ శక్తీ పీఠాలల్లో ఒకటి. జ్యోతిర్లింగాల్లో తల్లిదండ్రులతో కలిసి గణపతి కలిసి ఉన్న క్షేత్రం శ్రీశైలం.
స్వామి అమ్మవార్లు కలిసి ఒకే ప్రాంగణంలో ఉండటం ఒక అద్భుతం. ఈ భుమాండలంలో ఎక్కడ ఏ దిక్కున ఏ కార్యక్రమం చేసినా శ్రీశైల క్షేత్రానికి ఫలానా దిక్కున ఉన్నాము అని ఖచ్చితంగా సంకల్పంలో చెప్పి తీరాలి. ఏ పూజ కార్యక్రమం ప్రారంభించిన మొదటగా గణపతి పూజ చేసిన తరువాత నే మిగతా కార్యక్రమం ప్రారంభించాలి. అంతటి విశేష ప్రత్యేకత కలిగిన గణపతి కి భూమండలనికే నాభి కేంద్రం అయ్యిన శ్రీశైలంలో ప్రత్యేక స్థానం ఉంది. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్త్తులు మొదటగా సాక్షి గణపతిని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత.
సాక్ష్యం చెప్పే సాక్షి గణపతి
కైలాసంలో శివుడికి శ్రీశైలన్ని ఈ భక్తుడు దర్శించాడు అని గణపతి సాక్ష్యం చెపుతాడు అని పురాణాల్లో చెప్పి ఉంది. అందుకే ఇక్కడ సాక్షి గణపతి అని పేరు. మల్లిఖార్జున స్వామి దర్శనానికి ఆలయం లోపలికి వెళ్లి ముందు ఆలయంలో స్వామి వారి కి కుడి వైపున రత్నగర్భ గణపతి పేరు అక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ రత్నగర్భ గణపతి ని దర్శించుకు న్న వారికి తమ కోరికలు నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఆయనకు కుడి వైపున ఉండటం చాలా చాలా అరుదు ఇలాంటి క్షేత్రంలో ఈ రత్నగర్భ గణపతి కి ప్రత్యేక స్థానం ఉంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)