PM Modi Birthday: నేడు మోడీ పుట్టినరోజు.. ‘ఆయుష్మాన్ భవ’ ప్రచారం ప్రారంభం.. ఆరోగ్య మేళాల నిర్వహణ

ఆయుష్మాన్ భారత్ యోజన మాత్రమే కాదు ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సేవా పఖ్వాడా కార్యక్రమం కింద ఆరోగ్య మేళాలు నిర్వహిస్తామని, ఆయుష్మాన్ కార్డులు తయారు చేస్తామని, ఆయుష్మాన్ సభ నిర్వహిస్తామని, ఆయుష్మాన్ గ్రామాలను కూడా ప్రకటించనున్నారు. అంతేకాదు ఆయుష్మాన్ ఆప్ ద్వార్, ఆయుష్మాన్ ఫెయిర్, ఆయుష్మాన్ సభ, ఆయుష్మాన్ విలేజ్ కార్యక్రమాలను కూడా చేర్చారు. 

PM Modi Birthday: నేడు మోడీ పుట్టినరోజు.. 'ఆయుష్మాన్ భవ' ప్రచారం ప్రారంభం.. ఆరోగ్య మేళాల నిర్వహణ
Pm Modi Birthday
Follow us
Surya Kala

|

Updated on: Sep 17, 2023 | 8:17 AM

నేడు ప్రధాని నరేంద్ర మోడీ 73 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి అక్టోబర్ 2 వరకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా ‘ఆయుష్మాన్ భవ’ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. గత తొమ్మిదేళ్లుగా ప్రధాని మోడీ దేశాన్ని పాలిస్తున్నారు.  ప్రధాని పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ ‘సేవా పఖ్వాడా’ వేడుకలను జరపడానికి రంగం సిద్ధం చేసింది. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ ప్రయోజనాలను ప్రజలకు మరింత దగ్గరగా చెరువు చేయనుండి. దాదాపు 35 కోట్ల మందికి  ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను విస్తరించడమే ఈ ప్రచారం లక్ష్యం.

ఆయుష్మాన్ భారత్ యోజన మాత్రమే కాదు ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సేవా పఖ్వాడా కార్యక్రమం కింద ఆరోగ్య మేళాలు నిర్వహిస్తామని, ఆయుష్మాన్ కార్డులు తయారు చేస్తామని, ఆయుష్మాన్ సభ నిర్వహిస్తామని, ఆయుష్మాన్ గ్రామాలను కూడా ప్రకటించనున్నారు. అంతేకాదు ఆయుష్మాన్ ఆప్ ద్వార్, ఆయుష్మాన్ ఫెయిర్, ఆయుష్మాన్ సభ, ఆయుష్మాన్ విలేజ్ కార్యక్రమాలను కూడా చేర్చారు.

  1. ఆయుష్మాన్ మేళా: దేశవ్యాప్తంగా లక్షలాది హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో ఆయుష్మాన్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాల్లో ప్రజలకు ఆరోగ్య సంబంధిత సమాచారం, సేవలు అందించనున్నారు.  ఇక్కడ రోగికి స్క్రీనింగ్ చేసి బీపీ, షుగర్ కూడా చెక్ చేస్తారు. తీవ్ర అస్వస్థతకు గురైతే సమీపంలోని వైద్య కళాశాలలో చికిత్స అందిస్తారు.
  2. ఇంటి వద్దే ఆయుష్మాన్: ఈ కార్యక్రమం కింద అర్హులైనప్పటికీ.. ఇప్పటి వరకూ ఈ పథకం ప్రయోజనాలను పొందలేకపోతున్న వ్యక్తుల కోసం ఆయుష్మాన్ కార్డ్‌లు తయారు చేసి ఇస్తారు. ఈ ఏడాది 36 కోట్ల మందికి కార్డులు తయారు చేసి అందించాలనే లక్షాన్ని నిర్దేశించుకుని రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు 24 కోట్ల కార్డులు తయారు చేశారు. ఈ కార్డు విశిష్టత ను తెలియజేస్తూ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.
  3. ఇవి కూడా చదవండి
  4. ఆయుష్మాన్ సభ: అక్టోబర్ 2న అన్ని గ్రామాలు, వార్డుల్లో ఆయుష్మాన్ సభలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రజలకు ఆరోగ్య సంబంధమైన అవగాహన కల్పిస్తారు. ఇందులో ఆయుష్మాన్ కార్డు, అభా హెల్త్ కార్డ్, సికిల్ సెల్ అనీమియా తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు.
  5. ఆయుష్మాన్ గ్రామం: ఈ కార్యక్రమంలో భాగంగా 100 శాతం లబ్ధిదారులు నమోదు చేసుకున్న గ్రామాన్ని ఎంపిక జేసి.. ఆ గ్రామాన్ని ఆయుష్మాన్ గ్రామంగా ప్రకటిస్తారు.

‘ఆయుష్మాన్ భవ’ ప్రచారం అంటే ఏమిటి?

సెప్టెంబర్ 13 నుండి ఆయుష్మాన్ భవ ప్రచారం ప్రారంభమైంది. అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే ఈ ప్రచారం ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు దేశంలోని 25 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ప్రయోజనాలు అందుతున్నాయని చెప్పారు. అదే సమయంలో ఈ పథక ప్రయోజనాలను అక్టోబర్ నాటికి 35 కోట్ల మందికి విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ కింద, సాధారణ ప్రజలు ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య భీమాను పొందుతారు.  ఇందుకోసం ప్రజలకు ఆరోగ్య బీమా ‘ఆయుష్మాన్ కార్డు’ జారీ చేస్తారు. ఈ పథకం 2018 సంవత్సరంలో ప్రారంభించారు.

ఈ పథకంలో చేయనున్న ప్రచారాలు

  1. సెప్టెంబరు 17 నుండి అక్టోబర్ 2 వరకు అవయవ దాన ప్రచారం కూడా నిర్వహించనున్నారు.
  2. ప్రధాని మోడీ సందర్భంగా ఈ రోజు నుంచి గాంధీ జయంతి వరకూ రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.
  3. టీబీ రోగులను దత్తత తీసుకుంటారు.
  4. అన్ని ఆరోగ్య సంస్థల్లో పరిశుభ్రత ప్రచారం నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..