Ganesh Chaturthi: మొదలైన వినాయక చవితి సందడి.. దేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. రూ. 75 లక్షలతో తయారీ.. స్పెషాలిటీ ఏమిటంటే
ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో గాజువాకలో వినాయక విగ్రహ ప్రతిష్టతో వినాయక చవితి సందడి నెలకొంది. ఈ సంవత్సరం అద్భుతంగా 117 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం అద్భుతమైన హస్తకళతో, పర్యావరణ పరిరక్షణ కు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఏడాది గాజువాకలో గణపయ్య " శ్రీ అనంత పంచముఖ మహా గణపతి" గా కొలువుదీరి భక్తులను అనుగ్రహించనున్నాడు.
హిందువులు జరుపుకునే పండగల్లో వినాయక చవితికి విశిష్ట స్థానం ఉంది. పెద్దలు పిల్లలుగా మారి పిల్లలతో కలిసి అత్యంత ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలో అనేక ప్రాంతాలు రెడీ అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి వినియోగిద్దామనే ఆలోచనకు గణపతి భక్తులు సై అంటున్నారు. తాజాగా ఎకో ఫ్రెండ్లీ గణపతి భారీ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లో రెడీ చేశారు. ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నంలో గాజువాకలో వినాయక విగ్రహ ప్రతిష్టతో వినాయక చవితి సందడి నెలకొంది. ఈ సంవత్సరం అద్భుతంగా 117 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం అద్భుతమైన హస్తకళతో, పర్యావరణ పరిరక్షణ కు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఏడాది గాజువాకలో గణపయ్య ” శ్రీ అనంత పంచముఖ మహా గణపతి” గా కొలువుదీరి భక్తులను అనుగ్రహించనున్నాడు. ఈ భారీ విగ్రహం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన పర్యావరణ అనుకూల గణేష్ విగ్రహంగా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు రూ. 75 లక్షల ధరతో తయారైన ఈ శ్రీ అనంత పంచముఖ మహా గణపతి రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన విగ్రహంగా అవతరించింది.
ఈ అద్భుతమైన విగ్రహాన్ని తయారీ దారులు అత్యంత నైపుణ్యంతో.. ప్రేమ పూర్వకంగా తమకు దైవం పై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తూ రెడీ చేశారు. ఈ విగ్రహ తయారీ కోసం పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులు శ్రమించారు. కర్రలు, మట్టి, ఎండుగడ్డి, మట్టితో విగ్రహాన్ని తయారు చేశారు. విగ్రహ అలంకరణ కోసం ఉపయోగించిన రంగులు కూడా పర్యావరణ హితాన్ని కలిగించేవి సహజ రంగులను ఎంచుకున్నారు. ఇంకా చెప్పాలంటే గాజువాకలో కొలువైన గణపతి విగ్రహం పర్యావరణ స్పృహ థీమ్‌కు అనుగుణంగా తయారు చేశారు.
ఈ విగ్రహం విశాఖపట్నంలోని గాజువాకలోని లంక మైదానంలో దాని తాత్కాలిక నివాసంలో ఉంది. ఇక్కడ నుంచి వినాయక చవితి జరుపుకునే మండపానికి తరలిస్తారు. రేపటి నుంచి 18 రోజుల పాటు మండపంలో కొలువై భక్తులను అనుగ్రహించనున్నాడు గణపయ్య. గణపతి ఉత్సవాల మొదటి రోజు ఈ మహోన్నత కళాఖండాన్ని వీక్షించేందుకు లక్ష మందికి పైగా భక్తులు పండల్‌కు తరలివస్తారని అంచనా. భక్తుల రద్దీని నియంతరించేందుకు, భక్తుల సౌకర్యార్ధం.. ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు మండపంలో 10 నుండి 12 బారికేడ్ లైన్లను ఏర్పాటు చేశారు.
ఉత్సవాల చివరి రోజు ఈ భారీ విగ్రహం నిమజ్జనం పర్యావరణ అనుకూలతకు నిజమైన దృశ్యం అవుతుంది. అగ్నిమాపక యంత్రాలు, వివిధ పవిత్ర నదుల నుండి తెచ్చిన పాలు, నీటిని ఉపయోగించి మండపం వద్దనే నిమజ్జనం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్న భారీ విగ్రహాలతో పోల్చి చూస్తే.. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహంగా నిలుస్తుంది. శ్రీ అనంత పంచముఖ మహా గణపతి విగ్రహాన్ని 117 అడుగుల ఎత్తుతో తయారు చేశారు. సరికొత్త రికార్డ్ సృష్టించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..