Kanipakam Temple: సిద్ధివినాయకుడి ప్రచార రథాన్ని ప్రారంభించిన మంత్రి రోజా.. పిల్లలకు చిన్నతనం నుంచే భక్తి తత్వాన్ని నేర్పించాలని సూచన
సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ కాణిపాకంలో ప్రారంభమైన ధర్మ రథం నెల రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రచార రథం అనంతరం మంత్రి రోజా రాజకీయ వాడివేడి మాటలు కాకుండా శాంతి వచనాలతో ప్రసంగాన్ని ముగించారు. రాజకీయ ప్రత్యర్థులకు తన మాటలతో ఉక్కిరి బిక్కిరి చేయకుండా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో మనమందరం హిందువులమని హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ గౌరవించాలన్నారు.
ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా అంటేనే ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థులపై తూటా లాంటి డైలాగులతో విమర్శలు గుప్పించడం ఆమె నైజం. అది పొలిటికల్ వేదికలైనా, ప్రెస్ మీట్ అయినా, దైవ దర్శనం చేసుకున్న ఆలయాల ముందైనా మంత్రి రోజా ఎప్పుడు ప్రత్యర్థులపై రాజకీయాలపై పంచ్ డైలాగులు ఆమె నోట వినిపిస్తాయి. అయితే అందుకు భిన్నంగా మంత్రి ఆర్కే రోజా కాణిపాకంలో భక్తి ప్రవచనాలు విపించారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన రోజా స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుతో కలిసి మేళ తాళాలతో ఊరేగింపుగా వచ్చి ప్రచార రధాన్ని ప్రారంభించారు.
సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ కాణిపాకంలో ప్రారంభమైన ధర్మ రథం నెల రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పర్యటించనుంది. ప్రచార రథం అనంతరం మంత్రి రోజా రాజకీయ వాడివేడి మాటలు కాకుండా శాంతి వచనాలతో ప్రసంగాన్ని ముగించారు. రాజకీయ ప్రత్యర్థులకు తన మాటలతో ఉక్కిరి బిక్కిరి చేయకుండా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధిలో మనమందరం హిందువులమని హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ గౌరవించాలన్నారు. ఉదయాన నిద్రలేచి భూదేవికి నమస్కరించాలన్నారు. భగవంతుని పూజిస్తూ ప్రతి ఒక్కరు భక్తి తత్వం పెంచుకోవాలని సూచించారు మంత్రి రోజా.
అంతేకాదు తాను ఎక్కువగా పూజలు, హోమాలు, వ్రతాలు చేస్తూ ఉంటానని.. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలన్నాన్నారు రోజా. అదే విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లలకు ముఖ్యంగా భక్తిని ప్రబోధించాలన్నారు మంత్రి రోజా. ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలంటూ పోటీ పడుతున్నారని.. అయితే ఎంత విద్యావంతులైనా ఉపయోగం లేదన్నారు పిల్లలకు చిన్న వయసులో నుంచే భక్తి తత్వం నేర్పించాలని, అదే వాళ్లను కాపాడుతుందన్నారు మంత్రి ఆర్కే రోజా.
మరిన్ని ఆంధప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..