Prawns Thieves: రొయ్యల దొంగలు హల్ చల్.. వేటినీ వదలరా అని తలలు పట్టుకుంటున్న రైతులు
లీజుకు తీసుకున్న రైతు బాల కోటేశ్వరరావు రొయ్యల సాగు ప్రారంభించాడు. ప్రస్తుతం రొయ్యలు 80 కౌంట్ కు పెరిగాయి. అయితే దొంగలు ప్లాన్ లో భాగంగా కోటేశ్వరరావు లీజుకు తీసుకున్న చెరువును తమ దొంగతనానికి ఎంచుకున్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో చెరువు వద్దకు వెళ్లి వలలు వేసి రొయ్యల్ని పట్టుకున్నారు. వారు పట్టుకున్న రొయ్యలను 18 గోనె సంచల్లో సుమారు సంచికి 45 కిలోల చొప్పున 800 కిలోల రొయ్యలను వాటిలో నింపారు.
కాసేపట్లో అంతా అయిపోతుంది.. ఆనందంగా ఉండొచ్చు.. అనుకున్నారు ఆ దొంగలు. ఈ క్రమంలోనే వచ్చిన పని పూర్తి చేశారు. మరొక పది నిమిషాలు ఆగితే అక్కడి నుంచి దోచేసిన దానితో బయటపడేవారు. కానీ లాస్ట్ మినిట్లో వారి ప్లాన్ ఫెయిల్ అయింది. దాంతో దోచిన దానిని అక్కడే వదిలేసి అక్కడి నుంచి ఉడాయించారు. ఇంతకీ ఆ దొంగలు దోచుకోవడానికి ఎక్కడికి వెళ్లారు.. వారు దోచుకున్న సొత్తు ఏమిటి..? దోచుకున్న దానిని వదిలేసి అక్కడినుంచి ఎందుకు పరారయ్యారు.. అని ఆలోచిస్తుంటే.. ఆ దొంగతనం జరిగిన విధానం గురించి దొంగతనం చేసింది ఏమిటో తెలిస్తే మొదట షాక్ తింటారు.. నెక్ట్ నవ్వేస్తారు కూడా.. వివరాల్లోకి వెళ్తే..
ఇప్పటివరకు దొంగలు ఇళ్ల, షాపులు, దారిదోపిడీలలో డబ్బు బంగారం విలువైన వస్తువులు దోచుకోవడం మనం విన్నాం. కానీ ఇక్కడ ఏకంగా దొంగలు రొయ్యలు చెరువులో దొంగతనానికి విఫల యత్నం చేసి చివరకు అక్కడి నుంచి పారిపోయారు. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం ఆక్వా రంగానికి పెట్టింది పేరు.. ఇక్కడ ఎక్కడ చూసినా రొయ్యల చెరువులు, చేపల చెరువులు విస్తారంగా ఉంటాయి. అయితే కొందరు దొంగలు ఓ రొయ్యల చెరువులో రొయ్యలు దొంగిలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేశారు. నిడమర్రు గ్రామానికి చెందిన రెడ్డి వెంకట అప్పారావు అనే రైతు అదే గ్రామానికి చెందిన వేగిరెడ్డి బాల కోటేశ్వరరావుకు తన రొయ్యల చెరువు లీజుకి ఇచ్చాడు.
లీజుకు తీసుకున్న రైతు బాల కోటేశ్వరరావు రొయ్యల సాగు ప్రారంభించాడు. ప్రస్తుతం రొయ్యలు 80 కౌంట్ కు పెరిగాయి. అయితే దొంగలు ప్లాన్ లో భాగంగా కోటేశ్వరరావు లీజుకు తీసుకున్న చెరువును తమ దొంగతనానికి ఎంచుకున్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో చెరువు వద్దకు వెళ్లి వలలు వేసి రొయ్యల్ని పట్టుకున్నారు. వారు పట్టుకున్న రొయ్యలను 18 గోనె సంచుల్లో సుమారు సంచికి 45 కిలోల చొప్పున 800 కిలోల రొయ్యలను వాటిలో నింపారు. ఇంకేముంది అక్కడ నుంచి జారుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నారు. పది నిమిషాలు ఆగితే వారి పథకం పారి చేతిలోకి డబ్బులు వచ్చేవి.
ఇంతలో చెరుకు కాపలాదారుడుగా ఉన్న లక్ష్మణ్ కు చెరువు గట్టుపై ఏదో చప్పుడు వినిపించింది. వెంటనే అతను లేచి గట్టు పైన వున్న లైట్ వేశాడు. లైట్ వెలుతురికి అక్కడే ఉన్న దొంగలు పట్టు పడితే దేహశుద్ధి చేస్తారనే భయంతో ఎక్కడివి అక్కడ వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే కాపలాదారుడు లక్ష్మణ్ విషయాన్ని యజమానికి ఫోన్ చేసి వివరించాడు. అయితే దొంగలు దోచుకోవడాని యత్నించిన రొయ్యలు కౌంట్ 80 ఉంటుందని, వాటిని అమ్మితే కిలో రూ.260 చొప్పున 800 కిలోలకు రూ. 2.08 లక్షలు విలువ ఉంటుందని కాపలాదారుడు అప్రమత్తతతో దొంగల చోరీయత్నం విఫలమైందని యజమాని తెలిపారు. ఈ ఘటనపై రైతు బాల కోటేశ్వరరావు నిడమర్రు పోలీసులకు ఫిర్యాదు చేశాడు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..