గురువాయూరు దేవాలయం: కేరళలోని ప్రసిద్ధ హిందూ దేవాలయం గురువాయూరు దేవాలయం. ఇది హిందూ మత విశ్వాసానికి కేంద్ర బిందువు. ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల నాటిది. ఇక్కడ హిందువులకు మాత్రమే ప్రవేశం ఉంది. ఇతర మతాల వారు ఈ ఆలయంలోకి ప్రవేశించలేరు. ఈ ఆలయ ప్రధాన దైవం గురువాయూరప్పన్ అంటే శ్రీ కృష్ణుడు బాల గోపాలుడి రూపంలో పూజలను అందుకుంటాడు. ఈ ప్రదేశం శ్రీకృష్ణుడు, విష్ణువు నివాసంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా దీనిని దక్షిణ వైకుంఠం, ద్వారక అని కూడా పిలుస్తారు.