గుండెపోటు కంటే కార్డియాక్ అరెస్ట్ ప్రమాదకరం.. ఆకస్మిక మరణం.. దీని లక్షణాలు ఏమిటంటే
కొన్ని సందర్భాల్లోని మరణాలు గుండెపోటు వల్ల కాదు.. కార్డియాక్ అరెస్ట్ వల్ల కూడా కావొచ్చు. వ్యక్తి గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. చాలామంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ రెండిటిని ఒకేలా భావిస్తారు. వాస్తవానికి వీటి మధ్య వ్యత్యాసం ఉంది. గుండెపోటు కంటే గుండె ఆగిపోవడం చాలా ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండిటికి తేడా ఎలా తెలుసుకోవాలంటే..
ప్రస్తుతం జిమ్‌లో వర్కవుట్ చేస్తూనో, పరిగెడుతూనో.. ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ ఇలా రకరకాల సందర్భాల్లో మనుషులు మరణిస్తున్న వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తూ పడిపోయి లేదా.. స్టేజ్‌పై పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు.. గ్రౌండ్స్ లో ఆడుతూ కిందపడి మరణిస్తున్న సందర్భాలు కొన్ని కెమెరాలో రికార్డ్ అయి పలు కేసులు వెలుగులోకి వస్తుంటే.. ఎన్నో మరణాలు కెమెరాలో బంధించబడనివి ఉంటున్నాయి.. తరచుగా గుండెపోటు కారణంగా మరణం అని భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లోని మరణాలు గుండెపోటు వల్ల కాదు.. కార్డియాక్ అరెస్ట్ వల్ల కూడా కావొచ్చు. వ్యక్తి గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయి అక్కడికక్కడే చనిపోతాడు.
గుండెపోటుకి.. కార్డియాక్ అరెస్ట్ మధ్య వ్యత్యాసం ఉంది. ఆ తేడా ఏమిటో తెలుసుకుందాం..
చాలామంది గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ రెండిటిని ఒకేలా భావిస్తారు. వాస్తవానికి వీటి మధ్య వ్యత్యాసం ఉంది. గుండెపోటు కంటే గుండె ఆగిపోవడం చాలా ప్రమాదకరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెండిటికి తేడా ఎలా తెలుసుకోవాలంటే..
కొలెస్ట్రాల్, హై BP కారణంగా.. గుండెకు రక్తం సరఫరాలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో గుండె రక్తాన్ని పొందలేదు. దీంతో పంపింగ్ కోసం గుండె రెట్టింపు సామర్థ్యాన్ని ఉపయోగించాల్సి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో గుండెపోటు వస్తుంది.
ఇలాంటి సందర్భంలో తీవ్రమైన ఛాతీ నొప్పి , చేయి తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఆసుపత్రికి వెళ్లడానికి వ్యక్తికి సమయం ఉంటుంది.. వెంటనే ఆస్పత్రికి చేరుకొని తగిన చికిత్స తీసుకోవచ్చు. ఇలా ఆ వ్యక్తి జీవితాన్ని కాపాడవచ్చు.
అయితే కార్డియాక్ అరెస్ట్ విషయంలో ఇంత సమయం ఉండదు.. గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. వ్యక్తి చనిపోవచ్చు. 80 శాతం కేసుల్లో గుండె ఆగిపోవడం వల్ల గుండెపోటు వస్తుంది. గుండె ఆగిపోయిన సందర్భంలో.. వెంటనే CPR ఇవ్వడం ద్వారా గుండె పని చేసేటట్లు చేయవచ్చు. వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సమయం ఉంటుంది. అయితే ఆ వ్యక్తికి వెంటనే CPR ఇవ్వకపోతే.. గుండె పని చేయడం ఆగిపోయి వ్యక్తి తక్షణమే మరణిస్తాడు. .
కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు
- కార్డియాక్ అరెస్ట్ జరగడానికి ముందు.. రోగి గుండె చప్పుడు అకస్మాత్తుగా చాలా వేగంగా మారుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది.
- పల్స్, రక్తపోటు ఆగిపోతుంది
- రక్తం మెదడుకు, శరీరంలోని ఇతర భాగాలకు చేరదు.
- శరీరం అకస్మాత్తుగా చల్లబడటం ప్రారంభమవుతుంది. అంతేకాదు తన బరువు తానే మోయలేనట్లు బరువును భరించలేక పడిపోతాడు.
గుండె పనితీరు బాగుండేలా చూసేందుకు మార్గాలు
- రోజూ ఒక గంట నడవండి.
- బరువు పెరగకుండా చూసుకోండి
- రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.
- బయటి ఆహారం, జంక్ ఫుడ్ ను దూరంగా పెట్టండి.
- తినే ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోండి
- ఒత్తిడిని ఎక్కువగా దరి చేరకుండా ప్రశాంతంగా ఉండండి.
- తగినంత నిద్ర పొందండి
- రెగ్యులర్ గా ఆరోగ్యాన్ని చెక్ చేయించుకుంటూ ఉండండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: ఇక్కడ ఇచ్చిన ఆరోగ్య సంబంధిత వార్తలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.. ఎటువంటి సందేహాలున్నా వైద్య నిపుణులను సంప్రదించాలి.