Tippa Teega: తిప్పతీగ తోపు అంతే.. రోజు 2 ఆకులు నమిలితే చాలు..
తిప్ప తీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా మంచిది. ఇది ఆయుర్వేదంలో 'అమృతం'గా ప్రసిద్ది చెందింది. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. అవెంటో ఇప్పుడు చూద్దాం...
ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలో ఏదో ఒక ఔషద గుణం ఉంటుంది. అలాంటి అద్భుతమైన మొక్కల్లో తిప్పతీగ ఒకటి. ఆయుర్వేదం మందుల్లో దీన్ని అధికంగా వాడతారు. పురాతన కాలం నుండి సాంప్రదాయ వైద్యంలో దీని పాత్ర ఎంతో ఉంది. పట్టణాల్లో ఉండేవారికి దీని గురించి తెలియకపోవచ్చు కానీ.. పల్లెటూర్లలో ఎక్కడ బడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. మెరుగైన రోగనిరోధక శక్తి కోసం దీన్ని తీసుకుంటారు. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. ఆరోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ.. రోజు రెండు ఆకులను నమిలితే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తిప్పతీగతో పౌడర్, కాప్సూల్స్, జ్యూస్, తయారు చేసి అమ్ముతారు.
- తిప్పతీగ సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడటానికి ఉపకరిస్తుంది. యాంటీ-పైరేటిక్ స్వభావం కలిగి ఉండటం వలన విష జ్వరాలతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
- యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో మన శరీరానికి సహాయపడుతుంది.
- జలుబు, దగ్గు, టాన్సిల్స్ తదితర శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది.
- మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్‌ను అదుపు చేయడంలో తిప్పతీగ మీకు సహాయపడుతుంది.
- హెపటైటిస్, జ్వరం, ఆస్తమా, గుండె సంబంధిత రోగాలను నయం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
- శ్వాస ఆడకపోవడం, ఛాతీ బిగుతుగా ఉండడం, గురక, దగ్గు, వంటి లక్షణాలను నుంచి తిప్పతీగ స్వాంతన ఇస్తుంది
- తిప్పతీగ కాండం మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని తగ్గిస్తుందని యూరోపియన్ మెనోపాజ్, ఆండ్రోపాజ్ సొసైటీ అధికారిక జర్నల్ అయిన మాట్యురిటాస్‌లో ప్రచురితమైన ఒక నివేదిక స్పష్టం చేసింది.
- మానసిక ఆందోళన, ఒత్తిడితో సతమతం అయ్యేవాళ్లు తిప్పతీగ చూర్ణం రోజూ చాలా మంచిది.
- తిప్పతీగతో కామెర్లు నయం చేయవచ్చు
- తిప్పతీగతో మూత్ర సంబంధిత వ్యాధులు నయం అవుతాయి.
శస్త్ర చికిత్స చేయించుకున్న వాళ్లు, గర్బిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్న పిల్లలు తిప్పతీగ వాడితే ప్రమాదం అని అంటారు. అందుకే ఎవరైనా సరే తిప్పతీగ తీసుకునే ముందు ఆయుర్వేద నిపుణులను, వైద్యులను సంప్రదించండి..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి