Health Care: నిమ్మకాయ మాజాకా.. ఉదయాన్నే ఇలా చేస్తే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు..

నిమ్మకాయలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. నిమ్మకాయ వంటలో రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి నిధి కూడా.. దీని పుల్లని రుచి ఆహారాన్ని రుచికరంగా మార్చడంతోపాటు శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు.. మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి.

Health Care: నిమ్మకాయ మాజాకా.. ఉదయాన్నే ఇలా చేస్తే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు..
Lemon
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 05, 2024 | 8:38 PM

నిమ్మకాయలో అనేక పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి. నిమ్మకాయ వంటలో రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి నిధి కూడా.. దీని పుల్లని రుచి ఆహారాన్ని రుచికరంగా మార్చడంతోపాటు శరీరానికి అనేక పోషకాలను అందిస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు.. మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి. అందుకే.. నిమ్మకాయ వినియోగం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది. నిమ్మకాయను తీసుకోవడం వల్ల సహజసిద్ధమైన రీతిలో శరీరానికి పోషణ, రక్షణ లభిస్తుంది. రోజూ మీ ఆహారంలో నిమ్మకాయను చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అయితే, నిమ్మకాయలోని కొన్ని ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నివారించడానికి, నిమ్మ, తేనె కలిపిన గోరువెచ్చని నీటిని క్రమం తప్పకుండా తాగడం మంచిది.

జీర్ణక్రియ ప్రక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది

నిమ్మరసం జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అపానవాయువు, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో నిమ్మరసం కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

నిమ్మకాయ నీరు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. శరీరంలోని మురికిని బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇంకా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

చర్మానికి వరం

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.. అంతేకాకుండా.. చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. నిమ్మరసంలో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుగుపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి