Puri Temple: జగన్నాథుని విగ్రహ నీడ అద్దంలో ఎందుకు కనిపించలేదు..? ఆసక్తికరమైన కథ ఏమిటంటే..

1890వ సంవత్సరంలో ఒకసారి జన్మాష్టమి రోజున పూర్ణ రాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తున్నాడు. ఆ సమయంలో జగన్నాథుడి నీడ కనిపించక పోవడంతో ఆశ్చర్యపోయాడు. జగన్నాథుడు భోజనం చేయడం లేదని కొందరు అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నగర ప్రజలందరూ జగన్నాథునికి రోజంతా వివిధ రకాల ఆహారాలను సిద్ధం చేశారు. అయినప్పటికీ జగన్నాథుని నీడ కనిపించలేదు.

Puri Temple: జగన్నాథుని విగ్రహ నీడ అద్దంలో ఎందుకు కనిపించలేదు..? ఆసక్తికరమైన కథ ఏమిటంటే..
Puri Jagannath Temple
Follow us

|

Updated on: Feb 05, 2024 | 2:58 PM

హిందూ మతంలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చార్ ధామ్ యాత్రను పూర్తి చేసిన వారు  భగవంతుడి సన్నిధిని చేరుకుంటారని నమ్మకం. ఈ నాలుగు ధామ్‌లలో ప్రపంచ ప్రసిద్ధ చెందిన పూరీ  ధామ్‌లో ఉన్న జగన్నాథుని విగ్రహం ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. ఈ పూరీ ధామ్‌లో ఉన్న జగన్నాథుని విగ్రహం కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాదు ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథలు, రహస్యాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహం కూడిన ఒక సంఘటన ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. నిజానికి ఒకసారి జగన్నాథుని విగ్రహం నీడ ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఈ ఘటనను చూసిన పండితులు, భక్తులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

జగన్నాథ ఆలయంలో ఆసక్తికరమైన సంఘటన ఏమిటి?

1890వ సంవత్సరంలో ఒకసారి జన్మాష్టమి రోజున పూర్ణ రాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తున్నాడు. ఆ సమయంలో జగన్నాథుడి నీడ అద్దంలో కనిపించక పోవడంతో ఆశ్చర్యపోయాడు. జగన్నాథుడు భోజనం చేయడం లేదని కొందరు అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు నగర ప్రజలందరూ జగన్నాథునికి రోజంతా వివిధ రకాల ఆహారాలను సిద్ధం చేశారు. అయినప్పటికీ జగన్నాథుని నీడ కనిపించలేదు.

రాజుకు కలలో కనిపించిన జగన్నాథుడు

ఈ సంఘటనను చూసిన రాజు.. జగన్నాథుడి విగ్రహం నీడ కనిపించకుండా పోవడానికి వెనుక ఉన్న కారణం తెలిసే వరకు తాను భోజనం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాదు రాజు ఆ గుడిలో కూర్చుని దేవుడి నీడ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా రాజు ఎదురుచూస్తూ చూస్తూ కునుకు  తీశాడు. అప్పుడు ఆ రాజు కలలో  జగన్నాథుడు కనిపించి తాను ఆలయంలో లేనని.. భోజనం చేయడానికి ఒక పేద భక్తుడి గుడిసెకు వెళ్లానని  అందుకే ఆలయంలోని తన విగ్రహ నీడ కనిపించలేదని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత జగన్నాథునికి మళ్లీ నైవేద్యాలు సమర్పించినప్పుడు.. విగ్రహ నీడ స్పష్టంగా కనిపించింది.

ఇవి కూడా చదవండి

నేటికీ జగన్నాథపురిలో జగన్నాథునికి నైవేద్యాన్ని సమర్పించే సమయంలో పండితులు తమ అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటారని చెబుతారు. ఆ సమయంలో పండితుని అరచేతిలో ఉన్న నీటిలో జగన్నాథుడి విగ్రహ  నీడ స్పష్టంగా కనిపిస్తుంది. అలా నీడ కనిపించినప్పుడే జగన్నాథుడు నైవేద్యాన్ని స్వీకరించినట్లు భావిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు