AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7 Horse Painting: ఇంట్లో లేదా ఆఫీసులో పరిగెత్తే ఏడు గుర్రాల చిత్రం ఎక్కడ ఏ దిశలో పెట్టుకోవాలంటే..

పరుగెత్తే ఏడు గుర్రాలు విజయానికి చిహ్నంగా పరిగణించబడుతున్నాయి. హిందూమతం, న్యూమరాలజీ , వాస్తు శాస్త్రంలో ఏడు సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంఖ్య 7 శుభం, అదృష్టంగా పరిగణించబడుతుంది. పరిగెత్తే గుర్రాలు శక్తి, వేగం .. విజయానికి చిహ్నంగా పరిగణించడుతున్నాయి. వీటి సంఖ్య ఏడు  అయితే అవి ఉద్యోగం లేదా వ్యాపారంలో అభివృద్ధిని తీసుకుని వస్తాయి.

7 Horse Painting: ఇంట్లో లేదా ఆఫీసులో పరిగెత్తే ఏడు గుర్రాల చిత్రం ఎక్కడ ఏ దిశలో పెట్టుకోవాలంటే..
7 Horse Painting
Surya Kala
|

Updated on: Feb 05, 2024 | 3:50 PM

Share

వాస్తు శాస్త్రంలో పరుగెత్తే ఏడు తెల్ల గుర్రాల చిత్రం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ చిత్రాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు. వాస్తు ప్రకారం మీ ఇల్లు లేదా కార్యాలయంలో 7 పరుగెత్తే గుర్రాల చిత్రాన్ని లేదా పెయింటింగ్‌ను ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ పెయింటింగ్ ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతిని తీసుకురావడంలో సహాయపడుతుంది. అంతేకాదు అదృష్టానికి చిహ్నం. పరిగెత్తే గుర్రాలు శక్తి, వేగం .. విజయానికి చిహ్నంగా పరిగణించడుతున్నాయి. వీటి సంఖ్య ఏడు  అయితే అవి ఉద్యోగం లేదా వ్యాపారంలో అభివృద్ధిని తీసుకుని వస్తాయి. ఇది ఆర్థిక పరిస్థితి, సంపద  పురోగతికి దారితీస్తుంది.

ఏడు సంఖ్య ప్రాముఖ్యత

పరుగెత్తే ఏడు గుర్రాలు విజయానికి చిహ్నంగా పరిగణించబడుతున్నాయి. హిందూమతం, న్యూమరాలజీ , వాస్తు శాస్త్రంలో ఏడు సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంఖ్య 7 శుభం, అదృష్టంగా పరిగణించబడుతుంది. ఇంద్రధనస్సులో 7 రంగులు ఉంటాయి. వివాహం సమయంలో సప్తపది అంటే.. హోమం చుట్టూ 7 సార్లు తిరుగుతారు. అంతేకాదు వివాహం కూడా 7 జన్మల బంధంగా చెప్పబడింది.. ఆకాశ గంగలో 7 సప్త ఋషులు కూడా ఉన్నారు. సూర్య భగవానుడి రథంలో 7 గుర్రాలు కూడా ఉన్నాయి.

న్యూమరాలజీలో కూడా  7వ సంఖ్య జనన సంఖ్యగా ఉన్న పిల్లలను చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. ఈ కారణంగా 7 తెల్లని పెరుగేత్తే గుర్రాల పెయింటింగ్ చాలా అదృష్టంగా పరిగణించబడుతుంది. ఈ పెయింటింగ్‌ను సరైన దిశలో ఉంచినట్లయితే.. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

7 గుర్రాల పెయింటింగ్ ఏ దిశలో ఉంచాలంటే..

ఇంటికి ఉత్తర దిశలో 7 తెల్లని పెరిగెట్టే గుర్రాల పెయింటింగ్‌ను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయటం వలన ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి ..  ఆర్థిక లాభం ఉంటుంది. 7 గుర్రాల రథంపై సూర్య భగవానుడు ప్రయాణించే పెయింటింగ్ లేదా చిత్రం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ పెయింటింగ్‌ను ఇంటికి తూర్పు దిశలో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. సమాజంలో పేరు తెచ్చుకోవాలన్నా.. కీర్తి, గౌరవం కావాలన్నా ఇంటి దక్షిణ దిశలో పరుగెత్తే గుర్రాల పెయింటింగ్ ను ఏర్పాటు చేసుకోండి.

పరిగెత్తే గుర్రాల పెయింటింగ్‌ను ఇంట్లోకి తీసుకురావడానికి ముందు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఫొటోలోని గుర్రాలు తాడుతో కట్టినట్లు ఉండకూడదు. కనుక  పూర్తిగా తనిఖీ చేయండి. ఇటువంటి పెయింటింగ్స్ సంపదకు .. ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. మీరు మీ ఆఫీసులో పరుగెత్తే గుర్రాల పెయింటింగ్‌ను పెట్టుకోవాలనుకుంటే ఆ గుర్రాలు చిత్రం ఆఫీసు లోపల ఎదురుగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈ పెయింటింగ్ ఆఫీసులో దక్షిణ గోడపై మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Follow Us