AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala Ramakrishna Reddy: తల్లికి బాగోలేకపోతే డ్రామాలంటారా? ఎంపీ అవినాశ్‌ రెడ్డిపై తప్పుడు ప్రచారం: సజ్జల

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో అనవసర కథనాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

Sajjala Ramakrishna Reddy: తల్లికి బాగోలేకపోతే డ్రామాలంటారా? ఎంపీ అవినాశ్‌ రెడ్డిపై తప్పుడు ప్రచారం: సజ్జల
Sajjala Ramakrishna Reddy
Basha Shek
|

Updated on: May 23, 2023 | 2:51 PM

Share

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో అనవసర కథనాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ‘అవినాష్ రెడ్డి ఇప్పటి వరకూ ఆరేడు సార్లు విచారణకు వెళ్లారు. ముందు నుండి సీబీఐ విచారణ కు సహకరిస్తున్నారు. తల్లికి ఆరోగ్యం బాలేదు, తండ్రి జైలు లో ఉన్నాడు కనుక ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళాడు. అవినాష్ రాసిన లేఖకు సీబీఐ నుండి ఇంకా బదులు రాలేదు. కేంద్ర బలగాలు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. కర్నూల్ ఎస్పీ సహకరించడం లేదని ఎవరు చెప్పారు? సీబీఐ వాళ్ళు చెప్పారా? అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న రోజు డైవర్షన్ కోసం కేంద్ర బలగాలు అని ప్రచారం చేశారు. అలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు మా పార్టీ కార్యకర్తలు అభిమానంతో వస్తారు. ఏంటీ ఈ అన్యాయం అని అడగడానికి కార్యకర్తలు వస్తారు. తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు. దుర్మార్గం కదా? ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా..? తప్పుడు వార్తలు వేస్తుంటే కొందరు అభిమానులు ఆవేశంలో రియాక్ట్ అయ్యి ఉంటారు. సీబీఐ కు రాష్ట్ర పోలీసులకు ఏం చర్చలు జరిగాయో తెలీదు. డిపార్ట్మెంట్ టూ డిపార్ట్మెంట్ చాలా జరుగుతాయి. అవినాష్ రెడ్డి ఏమైనా పరార్‌ అవుతున్నాడా? శిక్ష పడి తప్పించుకుని తిరుగుతున్నాడా? వారం రోజులు సమయం అడిగాడు. ఇస్తారో వచ్చి తీసుకుని వెళ్తారో మాకేం తెలుసు. తీసుకుని వెళ్లినా పోయేదేముంది. తల్లికి కి కొడుకు అవసరం ఉంది కనుక వారం రోజులు సమయం కావాలని కోరారు. చంద్రబాబు అధికారంలో ఉనప్పుడు రాష్ట్రంలోకి సీబీఐ నో ఎంట్రీ జీఓ తెచ్చాడు. ఈరోజు గగ్గోలు పెట్టే వాళ్ళు ఆనాడు యెందుకు నోరెత్తలేదు’ అని మండిపడ్డారు సజ్జల

98 శాతం హామీలు అమలు చేశాం

కాగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యిన సందర్భంగా మాట్లాడిన సజ్జల.. ‘వైసీపీ రీ సౌండింగ్ విక్టరీ వచ్చి నేటికీ నాలుగేళ్లు. నాలుగేళ్లలో 98 శాతం హామీలు అమలు చేశాం. అవినీతి లేకుండా నేరుగా ఇంటి వద్దకే పాలన అందించాం. సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. పాలనా వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర అభివృద్ధి చేయబోతున్నాం. మూడు రాజదానుల ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రానికి రావాల్సిన వాటాగా కేంద్రం 10 వేల కోట్లు విడుదల చేసింది. ఏపీ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని సజ్జల తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..