AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: పోస్ట్ మాస్టర్ అదృశ్యం.. డబ్బును జమ చేసిన ఖాతాదారులు షాక్..

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలోని గ్రామీణ పోస్టాఫీసులో ఇంటి దొంగే కన్నం వేశాడు. రూ.2 లక్షలు నగదుతో పోస్ట్ మాస్టర్ పరారైన షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. గరుడఖండిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‎గా విధులు నిర్వహిస్తున్నాడు ప్రశాంత్ కుమార్.

AP News: పోస్ట్ మాస్టర్ అదృశ్యం.. డబ్బును జమ చేసిన ఖాతాదారులు షాక్..
Post Master
S Srinivasa Rao
| Edited By: |

Updated on: Feb 18, 2024 | 10:30 AM

Share

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలోని గ్రామీణ పోస్టాఫీసులో ఇంటి దొంగే కన్నం వేశాడు. రూ.2 లక్షలు నగదుతో పోస్ట్ మాస్టర్ పరారైన షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. గరుడఖండిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‎గా విధులు నిర్వహిస్తున్నాడు ప్రశాంత్ కుమార్. గత నాలుగు రోజులుగా ఖాతాదారులు జమ చేసిన రూ. 2 లక్షలు నగదును తన జేబులో వేసుకుని చేతి వాటం ప్రదర్శించాడు. కాశీబుగ్గలోని డివిజనల్ ఇండియన్ పోస్టల్ శాఖకు ఖాతాదారుల జమ చేసిన సొమ్ము చెల్లించకుండా రూ. 2 లక్షలు నగదుతో పరారయ్యాడు పోస్ట్ మాస్టర్. గత నాలుగు రోజులుగా గరుడఖండి పోస్టాఫీసులోని ఆర్థిక లావాదేవీల వివరాలు అందించక పోవడంతో శ్రీకాకుళం జిల్లా ఇండియన్ పోస్టల్ శాఖ సూపరిండెంట్ శ్రావణ్ కుమార్ గరుడఖండి గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. బ్రాంచి పోస్టుమాస్టర్ ప్రశాంత్ పరారయ్యాడని నిర్థారించుకున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ గరుడఖండి పోస్టాఫీసు పరిధిలోని ఖాతాదారులు చెల్లించిన సొమ్ముకి పాస్ పుస్తకంలో తేదీతో పాటు స్టాంపు వేసి ఉన్నట్లయితే వారి సొమ్ము వారం రోజుల్లో వెనక్కి ఇస్తామని వెల్లడించారు. రూ. 2 లక్షలు సొత్తుతో పరారైన ప్రశాంత్‎పై శాఖా పరమైన చర్యలు చేపడతామని తెలిపారు. పరారైన పోస్టల్ ఉద్యోగి బంధువులు నుంచి కొంత సొమ్ము (రూ.70 వేలు ) రికవరీ చేశామని అన్నారు. మిగితా సొమ్ము కూడా త్వరలో రికవరీ చేస్తామని తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..