Ayodhya: బాలరాముడి దర్శన ఏర్పాట్లపై అయోధ్య ట్రస్ట్‌కు టీటీడీ సూచనలు..
అయోధ్య రామాలయంలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణపై అయోధ్య ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ అవగాహన కల్పించింది. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతో పాటు క్యూలైన్ల నిర్వహణ అంశాలపై అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులతో చర్చించారు. టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి నేతృత్వంలో దేవస్థానం అధికారుల బృందం అవగాహన కల్పించింది.
అయోధ్య రామాలయంలో భక్తుల రద్దీ క్రమబద్ధీకరణపై అయోధ్య ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ అవగాహన కల్పించింది. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణతో పాటు క్యూలైన్ల నిర్వహణ అంశాలపై అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులతో చర్చించారు. టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి నేతృత్వంలో దేవస్థానం అధికారుల బృందం అవగాహన కల్పించింది. ట్రస్టు విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు అయోధ్యకు వెళ్ళారు. ట్రస్టు కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
బాలరాముడి ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలన్న అంశాలపై టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులకు బలరాముని దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు తీర్థప్రసాదాలు అందజేశారు. అయోధ్య పర్యటనలో టీటీడీ ఈవో వెంట దేవస్థాన ప్రత్యేక బృందంతో పాటు అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ జీ, జగదీష్ ఆఫ్లే, గిరీష్ సహస్ర భోజని, విశ్వహిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి రాఘవులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..