AP News: శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన జంట.. దేవస్థానం గదిలో ఏం చేశారంటే..

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం గౌరీ సదనం 137 రూమ్‎లో ఓ మహిళ, పురుషుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. అయితే మల్లేష్ అనే వ్యక్తి ఈనెల 13న రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్‎లో నమోదు కాగా ఈరోజు ఉదయం పక్క రూము తీసుకున్న యాత్రికులకు దుర్వాసన రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు.

AP News: శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన జంట.. దేవస్థానం గదిలో ఏం చేశారంటే..
Srisailam Temple
Follow us
J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Feb 18, 2024 | 6:51 AM

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం గౌరీ సదనం 137 రూమ్‎లో ఓ మహిళ, పురుషుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగుచూసింది. అయితే మల్లేష్ అనే వ్యక్తి ఈనెల 13న రూమ్ తీసుకున్నట్లు ఎంట్రీ బుక్‎లో నమోదు కాగా ఈరోజు ఉదయం పక్క రూము తీసుకున్న యాత్రికులకు దుర్వాసన రావడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన క్లీనింగ్ సిబ్బందికి చెప్పగా రూము దగ్గరికి వెళ్లిన సిబ్బంది ఒక్కసారిగా నిర్గాంత పోయారు. ఉరివేసుకుని వేలాడుతున్న ఇద్దరిని చూసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

దీనిపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో మహిళకు సంబంధించిన ఆధార్ లభించింది. దానిపై మహిళ పెరు ఇతగొని సరితా అని రాసి ఉండటాన్ని గమనించారు. ఆదే ప్రదేశంలో కత్తి, శానిటైజర్ బాటిల్ దొరికాయి. అయితే మరణించిన ఇద్దరు.. దంపతుల లేక ప్రేమ జంటన అనే కోణంలో శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు బృందం దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..