AP News: అటు ఆధ్యాత్మికం, ఇటు పర్యాటకంతో కళకళలాడుతున్న కరువుసీమ..
కరువు సీమలో పర్యాటకం పరుగులు తీసింది. డోన్ చుట్టుపక్కలి ప్రాంతాలను చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. వీకెండ్స్‌లో పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ఏపీలో ఒక్క ఎకరానికి కూడా నీటిపారుదలలేని నియోజకవర్గం డోన్. అలాంటి ప్రాంతంలో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
కరువు సీమలో పర్యాటకం పరుగులు తీసింది. డోన్ చుట్టుపక్కలి ప్రాంతాలను చూసేవారి సంఖ్య భారీగా పెరిగింది. వీకెండ్స్‌లో పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ఏపీలో ఒక్క ఎకరానికి కూడా నీటిపారుదలలేని నియోజకవర్గం డోన్. అలాంటి ప్రాంతంలో పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పూర్తి డ్రై అయిన వెంగలాంపల్లి చెరువు, అప్పిరెడ్డిపల్లి చెరువులకు శాశ్వత ప్రాతిపదికల పైప్ లైన్ నిర్మించి హంద్రీనీవా నీటితో నింపేశారు. రెండు చెరువులను ఆరు కోట్ల రూపాయలతో పర్యాటకంగా తీర్చిదిద్దారు. జాతీయ రహదారిపై ఉండటంతో అటు పర్యాటకులను, ఇటు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. నీటిలో తేలియాడే విధంగా, బోట్స్‌పై షికారు చేసే లాగా అందంగా తీర్చిదిద్దారు. రెండు చెరువుల్లోనూ ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండింటిని లాంఛనంగా ప్రారంభించడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.
వీటికి తోడు బేతంచెర్ల, డోన్ ప్రధాన రహదారి పక్కన దాదాపు 100 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నగరవనం ఏర్పాటు చేశారు. అచ్చం అడవిలో విహరించినట్లుగా పర్యాటకులు సేద తీరుతు వినోదం పొందుతున్నారు. బేతంచర్ల సమీపంలో బిల స్వర్గం గుహలు ఆకట్టుకుంటున్నాయి. సహజ సిద్ధంగా అద్భుతంగా వందల ఏళ్ల నాటి చారిత్రక గుహలను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. నిర్జన ప్రదేశంగా ఉండే బిల స్వర్గం గుహలు ప్రస్తుతం జన సంచారంతో కళకళలాడుతున్నాయి. మరోచోట వెలుగు చూసినవాల్మీకి గుహలు సైతం అబ్బురపరుస్తున్నాయి. బిల స్వర్గం గుహలను సైతం తలదన్నేలా సహజసిద్ధంగా వాల్మీకి గుహలు ఏర్పడ్డాయి. ఔరా అని అబ్బురపరుస్తున్నాయి. పైన కొండ.. దాని కింద సహజ సిద్ధమైన గుహలు వాటికి రంగురంగుల అందాలు అబ్బుర పరుస్తున్నాయి.
ఇక ఆధ్యాత్మికంగా కూడా భక్తులు తెగ సంతృప్తి పడుతున్నారు. మద్దిలేటి స్వామి అంటే చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఎనలేని భక్తి. శనివారం వచ్చిందంటే చాలు కనీసం లక్షమందికి పైగా భక్తజనం వాలిపోతారు. స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. అలాంటి మద్దిలేటి స్వామి క్షేత్రాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అందంగా తీర్చిదిద్దారు పాలకులు. రహదారులు, ఆలయ ప్రాంగణాలు, నూతన అతిథి గృహాలు సుశాల పార్కింగ్ స్థలాలతో మద్దిలేటి స్వామి క్షేత్రం అలరారుతోంది. గుండాల చెన్నకేశవ స్వామి అంటే చాలా ఫేమస్.
ఈ ఆలయ చరిత్ర చాలా గొప్పది. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా నిర్మించారని ప్రచారం. అలాంటి చెన్నకేశవ స్వామి ఆలయానికి ఒక్కసారిగా పూర్వ వైభవం వచ్చింది. ఆలయాన్ని అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఐదు కోట్ల రూపాయలతో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని నిర్మించింది. దీనిని కూడా మంత్రి బుగ్గన లాంఛనంగా ప్రారంభించారు. దీంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగి ఆలయ ప్రాంతం మొత్తం సందడిగా మారిపోయింది. ఇకనుంచి నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా అనేక శుభకార్యాలతో చెన్నకేశవ స్వామి తన పూర్వవైభవాన్ని చాటుకోనున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న రంగస్వామి ఆలయాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..