ఏపీలో బర్డ్ ప్లూ పంజా.. అప్రమత్తమైన అధికారులు.. ప్రజలకు కీలక సూచనలు
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. విజయవాడలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కృష్ణ, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు అధికారులు. కోళ్లు మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు అధికారులు.
ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. విజయవాడలో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కృష్ణ, గోదావరి, నెల్లూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు అధికారులు. కోళ్లు మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారణతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు అధికారులు. ఏపీ పశువర్ధన శాఖకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వైరస్ ఇతర ప్రదేశాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు. ఫిబ్రవరి 7 న ఈ వ్యాధి వ్యాప్తి చెందినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 10,000 పౌల్ట్రీ పక్షులు మరణించినట్లు భావిస్తున్నారు.
భోపాల్‌లోని ల్యాబ్‌కు పక్షుల నమూనాలను పంపిన తర్వాత, వారు H5N1 వైరస్ వేరియంట్ ఉనికిని నిర్ధారించారు. నిర్థారణ కావడంతో జిల్లా కలెక్టర్ హరి నారాయణ్ పశుసంవర్థక శాఖ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభావిత ప్రాంతాల్లో చికెన్ షాపులను మూసివేయడంతోపాటు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నివారణ చర్యల గురించి నివాసితులకు అవగాహన కల్పించడానికి గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ఈ వ్యాధిపై ప్రచారం కల్పించాలన్నారు. చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి 37 బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిపారు.
మూడు నెలల పాటు ప్రజలు చికెన్ తినకపోవడమే మంచిదని సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చికెన్ షాపులను మూసివేయలని భావిస్తున్నారు అధికారులు. దీనిపై చర్యలు చేపట్టేలా కీలక ప్రణాళికలు రచిస్తున్నారు. గతంలోనూ ఎన్నో లక్షల సంఖ్యలో కోళ్లు ఈ వైరస్ బారిన పడి మృతి చెందినట్లు నిర్థారించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని తెలిపారు. జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..