Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: ఏపీలో హీటెక్కిస్తున్న వలసల రాజకీయం.. వైసీపీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై.. త్వరలోనే టీడీపీలోకి..

రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖలు ఇస్తారు. ఏకకాలంలో అటు పదవికి, ఇటు పార్టీకి ఇద్దరు ఎంపీల రాజీనామా చేయబోతున్నారు.

AP Politics: ఏపీలో హీటెక్కిస్తున్న వలసల రాజకీయం.. వైసీపీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై.. త్వరలోనే టీడీపీలోకి..
Jagan - Chandrababu
Shaik Madar Saheb
|

Updated on: Aug 29, 2024 | 8:39 AM

Share

ఏపీ పాలిటిక్స్‌ మళ్లీ హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వంద రోజులు గడుస్తున్న వేళ వలసల రాజకీయం ఊపందుకుంటోంది. పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌ చెప్పి.. టీడీపీలో చేరతారన్న ప్రచారంతో ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కుతున్నాయి. దానికి తగ్గట్లే.. వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఈ మేరకు మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు పోతుల సునీత. ఈ క్రమంలోనే.. పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ఇవాళ పదవికి, పార్టీకి రాజీనామా చేయబోతున్నారు.

రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖలు ఇస్తారు. ఏకకాలంలో అటు పదవికి, ఇటు పార్టీకి ఇద్దరు ఎంపీల రాజీనామా చేయబోతున్నారు. ఇందుకోసం నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు మోపిదేవి, బీద మస్తాన్‌రావు.. మధ్యాహ్నం 12.30కి రాజ్యసభ చైర్మన్‌ అపాయింట్‌మెంట్‌ ఖరారు అయింది… సెప్టెంబర్‌ 5, 6 తేదీల్లో లోకేష్‌ సమక్షంలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది..

చంద్రబాబు కండీషన్..

ఇప్పటికే.. ఏలూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత.. పలువురు వైసీపీ నేతలు పేర్లు వినిపించాయి. ప్రధానంగా.. ఎంపీ మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ.. సడెన్‌గా ఆయనకంటే ముందే పోతుల సునీత రాజీనామా చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. దాంతో.. పోతుల సునీత బాటలోనే మరికొందరు పయనిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. వలసలపై స్పందించిన చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా మారుతోంది. టీడీపీలోకి ఎవరొచ్చినా రాజీనామా చేసి రావాలని.. అయితే.. వచ్చేవారిని వ్యక్తిత్వం ఆధారంగానే చేర్చుకుంటామని చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. అయినా ఎవర్నిబడితే వాళ్లను పార్టీలోకి తీసుకోమని.. పార్టీ బలోపేతానికి అవసరమైన వాళ్లనే తీసుకుంటామన్నారు. చేరికల విషయంలో నైతిక విలువలు పాటిస్తామని చంద్రబాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి

జగన్‌తోనే ఉంటా..

అయితే.. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు. తాను వైసీపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిరాధారమైన ఊహాగానాలు, తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు. తాను వైసీపీకి విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తనని.. వైసీపీలోనే ఉంటానని.. జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు విజయసాయిరెడ్డి..

లైవ్ వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..