- Telugu News Photo Gallery Know What happen if you have too much physical relationship with your partner in telugu
అది శృతిమించితే జరిగిది ఇదే.. షెడ్డుకు వెళతారు జాగ్రత్త..! ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి
లైంగిక చర్య అనేది ప్రతి జీవిలో సహజమైన చర్య.. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. కానీ లైంగిక కార్యకలాపాలు కూడా పరిమితికి మించి ఉంటే, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Shaik Madar Saheb | Edited By: TV9 Telugu
Updated on: Sep 06, 2024 | 6:22 PM

అమృతం ఎక్కువైతే విషం అంటారు. ఈ విధంగా, వివాహ జీవితంలో ఒక జంట సాన్నిహిత్యంలో సెక్స్ కూడా ఒక భాగం.. కానీ ఇది మితిమిరినది అయి ఉండకూడదు.. అయితే.. ఈ కారణంగా అనేక సంబంధాలు తెగిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. కొన్నిసార్లు లైంగిక కార్యకలాపాలు పరిమితికి మించి ఉంటే, అది వ్యసనంగా మారుతుంది.. ఆరోగ్యంపై మరిన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది. అవును, అధికంగా లైంగిక చర్యలో పాల్గొంటే.. భార్యాభర్తలిద్దరి శారీరక, భావోద్వేగ.. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ సహజ ప్రక్రియ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మితిమిరితే.. మాత్రం ఆరోగ్యానికి చేటేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమితికి మించిన సంభోగం ఆరోగ్యానికి ఏ విధంగా హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి..

విపరీతమైన అలసట - నీరసం: భాగస్వాములిద్దరూ అతి లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు శరీరంలో నోర్‌పైన్‌ఫ్రైన్, అడ్రినలిన్, కార్టిసాల్ విడుదలవుతాయి. దీని ఫలితంగా హృదయ స్పందన రేటు పెరుగుతుంది.. రక్తపోటు పెరుగుతుంది.. ఇది జీవక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. అధిక లైంగిక కార్యకలాపాలు శరీర శక్తిని కోల్పోయేలా చేస్తాయి.. దీనివ్ల లఅలసట, నీరసం, కండరాల నొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి.

పురుషాంగం వాపు - నొప్పి: లైంగిక చర్య తర్వాత పురుషులకు పురుషాంగంలో నొప్పి రావడం చాలా సాధారణం. కానీ అధిక లైంగిక చర్య, బలవంతంగా స్కలనం చేయడం ద్వారా పురుషాంగం వాపు, అధిక నొప్పికి కారణమవుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫ్లమేషన్ : మితిమీరిన లైంగిక కార్యకలాపాల వల్ల స్త్రీలలో యోనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది యోని గోడలను దెబ్బతీయడమే కాకుండా, జననేంద్రియాలలో మంట, మూత్రం పడటం, యూటీఐ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.

వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి: అతిగా సంభోగం చేయడం వల్ల స్త్రీలలో సెక్సువల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అసురక్షిత, పదేపదే శారీరక సంబంధం సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. తరచుగా లైంగిక చర్య చేయడం వల్ల మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.

డీహైడ్రేషన్: దంపతులిద్దరూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల శరీరం తేమను కోల్పోతుంది. ఈ సమయంలో శరీరం డీహైడ్రేట్ అవడం వల్ల చర్మ సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి.

ఆసక్తి కోల్పోవడం: పరిమితికి మించిన సంభోగం శారీరక సంబంధం ఆసక్తిని కోల్పోయేలా చేస్తాయి.. అధికంగా చేయడం ద్వారా సులభంగా క్లైమాక్స్‌కు దారితీయదు. ఈ నిరంతర లైంగిక కార్యకలాపాలు ఆహ్లాదకరమైన సంబంధాన్ని దెబ్బతీస్తాయి.. ఆసక్తిని కోల్పోయేలా చేస్తాయి. ఇది భాగస్వాములిద్దరికీ చేదు అనుభవానికి దారితీస్తుంది.. ప్రతిసారీ అదే జరిగితే, లైంగిక చర్య పట్ల ఆసక్తి కూడా తగ్గుతుంది.



















