Samantha: జీరో సైజు లో సామ్.. తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న అభిమానులు
సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే మిగిలిన వాళ్లందరూ ఏవేవో ట్రిక్కులు, జిమ్మిక్కులు చేయాలేమో! సమంత మాత్రం జస్ట్ ఒక్క పిక్ పెడితే చాలు... క్లిక్ అయిపోతారంతే. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోల మీద ఇలాంటి కామెంట్లు చాలానే వినిపిస్తున్నాయి. సామ్‌ని అంతగా మిస్ అవుతున్న జనాలు... ఫ్యూచర్‌లో మరింత మిస్ కాబోతున్నారా? ట్రెండ్ కావడానికి చాలా మందికి రీజన్స్ ఉండాలేమో, సమంతకు మాత్రం ఒక్క పిక్ చాలు అన్నట్టుంది పరిస్థితి.
Updated on: Aug 26, 2024 | 8:59 PM

సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే మిగిలిన వాళ్లందరూ ఏవేవో ట్రిక్కులు, జిమ్మిక్కులు చేయాలేమో! సమంత మాత్రం జస్ట్ ఒక్క పిక్ పెడితే చాలు... క్లిక్ అయిపోతారంతే. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోల మీద ఇలాంటి కామెంట్లు చాలానే వినిపిస్తున్నాయి.

సామ్‌ని అంతగా మిస్ అవుతున్న జనాలు... ఫ్యూచర్‌లో మరింత మిస్ కాబోతున్నారా? ట్రెండ్ కావడానికి చాలా మందికి రీజన్స్ ఉండాలేమో, సమంతకు మాత్రం ఒక్క పిక్ చాలు అన్నట్టుంది పరిస్థితి.

లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోల చుట్టూ చాలా ఇంట్రస్టింగ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంత సన్నగా ఎందుకు మారారు? హెల్త్ బాగానే ఉంది కదా.. అని ఆరా తీసేవాళ్లు ఓ వైపున్నారు.

సామ్ కంప్లీట్‌గా బాలీవుడ్‌కి షిఫ్ట్ కావాలనుకుంటున్నారా? అందుకే సైజ్ జీరోకి ట్రై చేస్తున్నారా? రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలన్నట్టు సామ్ మనసులో బాలీవుడ్ డ్రీమ్స్ దట్టంగా ఉన్నాయా? అందుకే ఇలాంటి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తున్నారా అంటూ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు మరి కొందరు.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు సామ్. ఆమె ఓన్ ప్రొడక్షన్ హౌస్‌లో చేస్తున్న మూవీ ఓ వైపు, నార్త్ ప్రాజెక్టులు మరోవైపు... ఇంతకీ ఫ్యూచర్‌లో సౌత్ ప్రాజెక్టులను కన్సిడర్ చేస్తారా? లేదా? ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ చర్చ షురూ అయింది... ఇంతకీ సామ్ ప్లానింగ్ ఎలా ఉందో.. లెట్స్ వెయిట్ అండ్ సీ...




