Pawan Kalyan: షూటింగ్‌లో పవన్ బిజీబిజీ.. వారాహి టూర్ ఇప్పట్లో లేనట్టేనా..? జనసేన నెక్స్ట్ ప్లానేంటి..
Pawan Kalyan Varahi Yatra 4th phase: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మరికొన్ని రోజులు ఆలస్యం కానుంది. ఇప్పటికే మూడు విడతల యాత్ర చేసిన పవన్ కళ్యాణ్.. నాలుగో విడత యాత్ర ప్రారంభానికి గ్యాప్ తీసుకున్నారు. సెప్టెంబర్ మూడో వారంలో వారాహి విజయయాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు జనసేన పార్టీ నేతలు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు
Pawan Kalyan Varahi Yatra 4th phase: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మరికొన్ని రోజులు ఆలస్యం కానుంది. ఇప్పటికే మూడు విడతల యాత్ర చేసిన పవన్ కళ్యాణ్.. నాలుగో విడత యాత్ర ప్రారంభానికి గ్యాప్ తీసుకున్నారు. సెప్టెంబర్ మూడో వారంలో వారాహి విజయయాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు జనసేన పార్టీ నేతలు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. మరో 15 రోజుల పాటు షూటింగ్ ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. వారాహి విజయయాత్ర ద్వారా మూడు విడతల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. మొదటి విడతలో ఉమ్మడి గోదావరి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండో విడతలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి జైత్రయాత్ర కొనసాగింది. ఇక మూడో విడత వారాహి యాత్రను ఆగస్ట్ 10 నుంచి 19వ తేదీ వరకూ ఉమ్మడి విశాఖపట్నంలో కొనసాగించారు. విశాఖపట్నం పర్యటనలో కేవలం రెండు బహిరంగ సభలు మాత్రమే నిర్వహించారు. విశాఖపట్నంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ఎక్కువ సమయం కేటాయించారు పవన్ కల్యాణ్. రుషికొండతో పాటు ఎర్రమట్టి దిబ్బల పరిశీలన ద్వారా ప్రభుత్వం విమర్శల వర్షం కురిపించారు. అయితే నాలుగో విడత వారాహి యాత్ర ఇప్పట్లో లేదని, కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
నెలలో సగం రోజులు యాత్ర.. సగం రోజులు సినిమాలు..
పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర ద్వారా పార్టీ నేతలు, కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. అయితే వారాహి యాత్ర ప్రారంభం అయిన తర్వాత మొదటి మూడు విడతల యాత్రలకు మధ్యలో పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. కేవలం బ్రో సినిమా రిలీజ్ సమయంలో మాత్రం కాస్త విరామం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమా ప్రాజెక్టులతో అటు యాత్రకు ఇటు సినిమాలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఉంది. అప్పటినుంచి పన్నెండో తేదీ వరకూ షూటింగ్‌లోనే ఉంటారని తెలిసింది. ఇక సెప్టెంబర్ మూడో వారం నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దానికి తగ్గట్లుగా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వరకూ పవన్ కళ్యాణ్ కు సినిమా షూటింగ్‌లు ఉన్నాయి.
దీంతో ఈ నాలుగు నెలలు ప్రతి నెలా సగం రోజులు సినిమా షూటింగ్‌కు, మరో సగం రోజులు పార్టీకి కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. నెలలో సగం రోజులు పూర్తి స్థాయిలో పార్టీపై దృష్టి సారించనున్నట్లు పేర్కొంటున్నారు పార్టీ నేతలు.. ఇదే సమయంలో వారాహి యాత్రతో పాటు పార్టీ జాయినింగ్స్, నియోజకవర్గాల వారీగా సమీక్షలపైనా దృష్టి పెట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇక జనవరి నుంచి సినిమాలకు పూర్తి దూరంగా ఉంటూ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడతారట పవన్ కళ్యాణ్. ఎన్నికల వరకూ మొత్తం 100 రోజుల పాటు 100 సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. వారాహి యాత్రలో కవర్ కాని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనవరి నుంచి పవన్ బహిరంగ సభలు నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్దం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.
జనవరి నుంచి నియోజకవర్గాల్లో సభలు
పవన్ కళ్యాణ్ మూడు విడతల వారాహి యాత్ర అనంతరం.. కేవలం కొన్ని ప్రాంతాలకే పవన్ యాత్ర పరిమితమవుతుందని.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉండవని రాజకీయంగా విమర్శలు వచ్చాయి. కానీ పవన్ కల్యాణ్ తాజా షెడ్యూల్ ప్రకారం.. అన్ని జిల్లాల్లో పర్యటనలు ఉంటాయంటున్నారు పార్టీ నేతలు.. ముఖ్యంగా పార్టీకి పట్టున్న నియోజకవర్గాల్లో ముందుగా పర్యటన చేయడం.. అక్కడ ఖచ్చితంగా విజయం సాధించాలని ముందుకెళ్తున్నారు. ఇక జనవరి నుంచి మొత్తం 175 నియోజకవర్గాల్లో పర్యటనలు,100 బహిరంగ సభల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాలు కవర్ చేయాలనుకుంటున్నారు. అయితే పొత్తులపై స్పష్టత వచ్చినా.. రాకున్నా ఈలోగానే మెజార్టీ స్థానాలు కవర్ చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ వారాహి యాత్ర కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉండేలా జనసేన పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..