Andhra Pradesh: వామ్మో.. వీళ్లు మామూలు ఆడలేడీస్‌ కాదుర బాబోయ్‌.. ఏకంగా రూ.60లక్షల విలువైన చీరలు అపహరణ..

విలువైన చీరెలను రెండు కాళ్ల మధ్యలో పెట్టుకొని ఎవరూ గమనించకుండా అక్కడ నుండి ఉడాయించడం ఈ మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. అయితే సిసి కెమెరాల్లో చిక్కడంతో గత కొంతకాలంగా ఇక్కడ అటువంటి దొంగతనాలకు పాల్పడటం మానేశారు. ఇప్పుడు ఏకంగా బెంగుళూరులో అరెస్ట్ కావడంతో వీరు అక్కడికి మకాం మార్చినట్లు ఇక్కడి పోలీసులు భావిస్తున్నారు.

Andhra Pradesh: వామ్మో.. వీళ్లు మామూలు ఆడలేడీస్‌ కాదుర బాబోయ్‌.. ఏకంగా రూ.60లక్షల విలువైన చీరలు అపహరణ..
Guntur Gang
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 28, 2023 | 3:45 PM

గుంటూరు, ఆగస్టు28: అందంగా రెడీ అవుతారు. కాస్ల్టీ చీరెలు కట్టుకుంటారు. మెట్రో పాలిటిన్ సిటీల్లోని పెద్ద పెద్ద చీరల షోరూమ్ లకు వెళతారు. అక్కడికి వెళ్లాలంటే రిచ్ గా ఉండాలి కదా అందుకే ఏకంగా విజయవాడ నుండి బెంగుళూరు వరకూ విమానంలో ప్రయాణించారు. అక్కడున్న ఒక పెద్ద షాపుకి ముగ్గురు మహిళలు వెళ్లారు. చీరలు, నగలు ధరించి రిచ్ గా కనిపించగానే షాపు వాళ్లు సాదరంగా స్వాగతం పలికారు. అన్ని కాస్ట్లీ చీరలే చూశారు. ఇదే సమయంలో ఏకంగా పద్నాలుగు లక్షల రూపాయల విలువైన చీరలను అపహరించారు. అక్కడ నుండి జారుకునే లోపే షాపులోని సేల్స్ బాయ్ గుర్తించి యజమానికి చెప్పాడు. యజమాని బెంగుళూరులోని యలహంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. గుంటూరు జిల్లాకు చెందిన చీరల దొంగల గ్యాంగ్ ఆటకట్టించారు.

గుంటూరు జిల్లాలోని తాడేపల్లికి చెందిన రమణ, రత్నాలు, చుక్కమ్మలు విజయవాడ నుండి బెంగుళూరు వరకూ విమానంలో ప్రయాణించినట్లు బెంగుళూరు పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా బెంగుళూరు వచ్చి వివిధ షోరూంల్లో చోరిలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. ఇప్పటి వరకూ దాదాపు అరవై లక్షల రూపాయల విలువైన చీరెలను దొంగలిచినట్లు ముగ్గురు మహిళలు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.

అయితే తాడేపల్లికి చెందిన మహిళలు ఇటువంటి నేరాలు చేయడంలో అందెవేసిన చెయ్యి. గతంలోనూ గుంటూరు నగరంతో పాటు తెనాలిలో షోరూంలల్లో దొంగతనాలకి పాల్పడుతున్న మహిళలను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. సిసి కెమెరా విజువల్స్ ఆధారంగా వీరిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. విలువైన చీరెలను రెండు కాళ్ల మధ్యలో పెట్టుకొని ఎవరూ గమనించకుండా అక్కడ నుండి ఉడాయించడం ఈ మహిళలకు వెన్నతో పెట్టిన విద్య. అయితే సిసి కెమెరాల్లో చిక్కడంతో గత కొంతకాలంగా ఇక్కడ అటువంటి దొంగతనాలకు పాల్పడటం మానేశారు. ఇప్పుడు ఏకంగా బెంగుళూరులో అరెస్ట్ కావడంతో వీరు అక్కడికి మకాం మార్చినట్లు ఇక్కడి పోలీసులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..